కొత్త శక్తి వచ్చింది.. ఆ భయాన్ని పూర్తిగా జయించా : రష్మిక | Rashmika Mandanna Overcomes Fear Of Heights During Mysa Shoot, Shares Emotional Experience From Kerala Forests | Sakshi
Sakshi News home page

కొత్త శక్తి వచ్చింది.. ఆ భయాన్ని పూర్తిగా జయించా : రష్మిక

May 14 2026 12:23 PM | Updated on May 14 2026 1:22 PM

Rashmika Mandanna Latest Instagram Post Goes Viral

నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్న ప్రస్తుతం రవీంద్ర పుల్లె దర్శకత్వంలో ‘మైసా’ అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఇటీవల కొచ్చిలోని దట్టమైన అడవుల్లో జరిగింది. సాధారణంగా రష్మికకు 'అక్రోఫోబియా' (ఎత్తులంటే భయం) ఉంది. అయితే, ఈ సినిమా కారణంగా ఆ భయాన్ని అధిగమించానని చెబుతోంది రష్మిక. ఈ మేరకు ఇన్‌స్టాతో ఓ సుధీర్ఘమైన పోస్ట్‌ పెట్టింది. 

 ‘కొచ్చిలో ఉన్న రోజులు ఎన్నో జ్ఞాపకాలను మిగిల్చాయి. అడవులు, కీటకాలు, జలపాతాలు, ట్రెక్కింగ్‌లు, వర్కౌట్లు, వర్షాలు.. ఇలా ప్రతిదీ ఒక అనుభవం. నాకు ఎత్తులంటే చాలా భయం. ఇక్కడ  ఆ భయాన్ని పూర్తిగా జయించాను. మోకాళ్లకు గాయాలైనా పట్టువదలకుండా పోరాడటం నాకు కొత్త శక్తిని ఇచ్చింది. ఉదయాన్నే అలారం మోగగానే నిద్ర లేవడం నుంచి, ఎంతో ఇష్టమైన పళం పూరీలు కడుపునిండా తినడం వరకు ప్రతి క్షణాన్ని ఆస్వాదించాను’ అంటూ కొచ్చిలో దిగిన ఫోటోలను ఇన్‌స్టాలో షేర్‌ చేసింది. 

కాగా, ఈ సినిమాలో  కీలకమైన ఓ  యాక్షన్ సీక్వెన్స్ కోసం రష్మిక ఎలాంటి డూప్‌ లేకుండా ఏకంగా 80 అడుగుల ఎత్తు నుంచి దూకి అందరినీ ఆశ్చర్యపరిచారు.ఈ సాహసోపేతమైన ఫీట్ చేస్తున్న సమయంలో రష్మిక కాళ్లు, చేతులకు గాయాలయ్యాయి. అయినప్పటికీ, ఆమె ఏమాత్రం విరామం తీసుకోకుండా పట్టుదలతో షూటింగ్‌లో పాల్గొన్నారని దర్శకుడు  ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement