బెల్లంకొండ సతీమణి ఆదాయం నెలకు రూ.90 లక్షలా.. ఏం చేస్తారంటే? | Bellamkonda Sai srinivas wife Kavya reddy Business earnings Goes Viral | Sakshi
Sakshi News home page

Kavya Reddy: కావ్య రెడ్డి ఆదాయం నెలకు రూ.90 లక్షలు.. ఆమె బిజినెస్ ఏంటంటే?

May 10 2026 9:54 AM | Updated on May 10 2026 11:31 AM

Bellamkonda Sai srinivas wife Kavya reddy Business earnings Goes Viral

టాలీవుడ్‌ నటుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ ఇటీవలే కొత్త జీవితాన్ని ప్రారంభించాడు . తను ప్రేమించిన కావ్యా రెడ్డిని పెళ్లాడారు. తిరుమలలో ఆమె మెడలో మూడుముళ్లు వేశాడు. రెండు కుటుంబాల సమక్షంలో తిరుమలలోని శ్రీవెంకటేశ్వర స్వామి సన్నిధిలో వీరిద్దరి పెళ్లి వేడుక జరిగింది.

అయితే బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ సతీమణి కావ్య హైదరాబాద్‌కు చెందిన అమ్మాయేనని మనందరికీ తెలుసు. ఆమె తాత జడ్జి కాగా తండ్రి లాయర్ అని తెలుస్తోంది. అంతకుమించి ఆమె వ్యక్తిగత వివరాలు పెద్దగా తెలియదు. కానీ తాజాగా కావ్యకు సంబంధించిన ఓ వార్త నెట్టింట హల్‌చల్ చేస్తోంది.

బిజినెస్‌తో రూ.90 లక్షలు..

ఆమె బిజినెస్ ద్వారానే నెలకు ఏకంగా రూ.90 లక్షలు రూపాయలు సంపాదిస్తుందని సమాచారం. అరటి మొక్కల నుంచి వచ్చే నారతో శారీలు తయారు చేసే బిజినెస్ చేస్తున్నారట. వీటికి విదేశాల్లో అధిక డిమాండ్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ బిజినెస్ ద్వారా కావ్య రెడ్డి నెలకు దాదాపు రూ.90 లక్షలు సంపాదిస్తున్నారని లేటేస్ట్ టాక్. ప్రస్తుతం ఈ టాపిక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా.. మార్చిలో కావ్యాతో నిశ్చితార్థం చేసుకోగా.. ఏప్రిల్ 29వ తేదీన తిరుమలలో సింపుల్‌గా పెళ్లి పీటలెక్కారు.

 

Advertisement
 
Advertisement
Advertisement