పర్సంటేజీ సమస్య.. ఫిలిం ఛాంబర్ కీలక నిర్ణయం | Telugu Film Chamber Decision On Percentage Issue Latest | Sakshi
Sakshi News home page

Tollywood: 1-2 నెలల్లో సమస్య పరిష్కారం.. నిర్మాత వ్యాఖ్య

May 15 2026 1:19 PM | Updated on May 15 2026 1:29 PM

Telugu Film Chamber Decision On Percentage Issue Latest

టాలీవుడ్‌లో ప్రస్తుతం నిర్మాతలు వర్సెస్ ఎగ్జిబిటర్లు అన్నట్లు వివాదం నడుస్తోంది. మల్టీప్లెక్స్‌ల్లో ఇస్తున్నట్లే సింగిల్ స్కీన్లలోనూ పర్సంటేజీ ఇవ్వాలని ఎగ్జిబిటర్లు పట్టుబడుతున్నారు. నిర్మాతలు మాత్రం దీనికి పూర్తిగా అంగీకరించట్లేదు. వ్యవహారం శ్రుతి మించుతుండటంతో ఇందులో ఫిలిం ఛాంబర్ కల్పించుకుంది. హైదరాబాద్‌లో శుక్రవారం ఇరువర్గాలతో కలిసి మీటింగ్ పెట్టింది. ఇందులోనే కీలక నిర్ణయం తీసుకుంది.

(ఇదీ చదవండి: నిర్మాతలు vs ఎగ్జిబిటర్స్.. హీరోలు, ప్రేక్షకులు ఎవరివైపు?)

పర్సంటేజ్ సమస్య పరిష్కారం కోసం కమిటీ ఏర్పాటు చేస్తున్నాం. కమిటీలో 18 మంది సభ్యులు. 1-2 నెలల్లో సమస్య పరిష్కారమవుతుంది. ఈ టైంలో సినిమా రిలీజులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. నిర్మాతలు, ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్ నుంచి తలో ఆరుగురు కమిటీలో ఉంటారని నిర్మాత సి.కళ్యాణ్ చెప్పుకొచ్చారు.

ఫిలిం ఛాంబర్‌లో ఎగ్జిబిటర్స్ యాక్టీవ్ గిల్డ్ నిర్మాతలు సమావేశం వాడివేడిగా  సాగుతోంది. చర్చలు జరుగుతున్నప్పుడే ఏషియన్ సునీల్ నారంగ్ అరుస్తూ బయటికి వచ్చేశారు. దీంతో ఈయనని బతిమాలిన చదలవాడ శ్రీనివాస్, దిల్ రాజు, నాగవంశీ, అనుపమ్ రెడ్డి తిరిగి మీటింగ్‌కు తీసుకువెళ్లారు. ప్రస్తుతం ఇరు వర్గాలు వేర్వేరుగా మీటింగ్ పెట్టుకుని మాట్లాడుకుంటున్నారు.

(ఇదీ చదవండి: మహేశ్ బాబుకి హిందీ రాదు.. అందుకే: టాలీవుడ్ విలన్)

Advertisement
 
Advertisement
Advertisement