చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఇక శుక్రవారం వచ్చిందంటే చాలు.. బాక్సాఫీస్ వద్ద కొత్త సినిమాల సందడి షరామామూలే. ఈ వారంలో కోలీవుడ్ హీరో కరుప్పు ప్రేక్షకుల ముందుకొస్తోంది. తెలుగులోనూ వీరభద్రుడు పేరుతో రిలీజ్ చేస్తున్నారు. దీంతో పాటు అరేయ్ ఆపండ్రా, హరుడు, శివం శైవం అనే తెలుగు మూవీస్ విడుదలవుతున్నాయి. కానీ వీటిపై పెద్దగా బజ్ లేదు. దీంతో సినీ ప్రియులు ఓటీటీల వైపు చూస్తున్నారు.
ఇక ఈ ఫ్రైడే ఓటీటీల విషయానికొస్తే దురంధర్-2పైనే అందరి కళ్లు ఉన్నాయి. ఈ సినిమా మే 15 నుంచే నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్(ఓవర్‌సీస్ ఆడియన్స్‌కు మాత్రమే) కానుంది. దీంతో పాటు తిమ్మరాజుపల్లి టీవీ, తెరచార లాంటి టాలీవుడ్ సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చేస్తున్నాయి. అంతేకాకుండా కర్తవ్య లాంటి డబ్బింగ్ సినిమా, పలు డబ్బింగ్ సిరీస్‌లు రెడీ అయిపోయాయి. ఏయే చిత్రాలు ఎక్కడ స్ట్రీమింగ్ కానున్నాయో మీరు కూడా ఓ లుక్కేయండి.
నెట్‌ఫ్లిక్స్
- ధురంధర్ 2 (హిందీ సినిమా) - మే 15 (ఓవర్సీస్ రిలీజ్)
- కర్తవ్య (తెలుగు డబ్బింగ్ మూవీ) - మే 15
- బెర్లిన్ అండ్ ద లేడీ విత్ ఎర్మిన్ (ఇంగ్లీష్ సిరీస్) - మే 15
- ఇట్స్ నాట్ లైక్ దట్(హాలీవుడ్ సిరీస్)- మే 15
- ది వండర్ ఫూల్స్(కొరియన్ సిరీస్)- మే 15
- ది క్రాష్(డాక్యుమెంటరీ చిత్రం)- మే 15
అమెజాన్ ప్రైమ్
- ఎగ్జామ్ (తెలుగు డబ్బింగ్ సిరీస్) - మే 15
- డ్రైవర్స్ ఈద్(హాలీవుడ్ సినిమా)- మే 15
జియో హాట్‌స్టార్
- ఇన్‌స్పెక్టర్ అవినాష్ సీజన్ 2 (హిందీ సిరీస్) - మే 15
ఆహా
- తిమ్మరాజుపల్లి టీవీ (తెలుగు సినిమా) - మే 15
సన్ నెక్ట్స్..
- తెరచాప(తెలుగు సినిమా)- మే 15
జీ5..
- టిఘీ (మరాఠీ మూవీ) - మే 15
మనోరమ మ్యాక్స్..
- కప్(మలయాళ సినిమా)- మే15
లయన్స్ గేట్ ప్లే..
- కౌచర్(హాలీవుడ్ మూవీ)- మే 15
హులు..
- రివల్స్(హాలీవుడ్ సినిమా)- మే 15
ముబీ..
- ది మిస్టిరీయస్ గేజ్ ఆఫ్ ది ఫ్లైమింగో(హాలీవుడ్ సినిమా)- మే 15


