వాల్తేరు వీరయ్య మూవీ తర్వాత చిరంజీవి - దర్శకుడు బాబీ మరో ప్రాజెక్ట్ కోసం జతకట్టారు. వీరిద్దరి కాంబోలో ‘మెగా 158’ వర్కింగ్ టైటిల్‌తో వచ్చే సెట్స్‌పైకి వెళ్లనుంది. ఇప్పటికే ఈ భారీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన టైటిల్ సోషల్‌మీడియాలో వైరలవుతోంది. కేవీఎన్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి 'కాకాజీ' అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు సమాచారం. ఈ చిత్రం పూర్తిగా భారీ యాక్షన్ సీన్స్‌తో నిండిన కథతో రానుందని మేకర్స్ తెలిపారు. ఇప్పటికే షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ ఆలస్యమైంది.
అయితే తాజాగా ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన బిగ్ అప్‌డేట్ వచ్చేసింది. ఈ మూవీ అఫీషియల్‌గా లాంఛ్ కానుంది. ఈనె 21 నుంచి పూజా కార్యక్రమాలతో క్రేజీ ప్రాజెక్ట్ షూటింగ్ ప్రారంభం కానుందని మెగాస్టార్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. పరిమితులను అధిగమించడానికి ప్రతి రోజూ మరో అవకాశం…నా ప్రియమైన డైరెక్టర్ బాబీ గారితో మెగా 158 కోసం మరో చిరస్మరణీయ ప్రయాణానికి ఎంతో ఉత్సాహంగా ఉన్నాను.. ప్రారంభోత్సవం మే 21న అంటూ జిమ్‌లో వర్కవుట్ చేస్తున్న వీడియోను పోస్ట్ చేస్తున్నారు. ఇది చూసిన అభిమానులు 70 ఏళ్ల వయసులో మెగాస్టార్ వర్కవుట్స్ చూసి ఆశ్చర్యపోతున్నారు.


