ప్రియురాలిని పెళ్లాడిన టాలీవుడ్ కమెడియన్.. ఫైమా స్పెషల్ విషెస్ | Tollywood Comedian Patas Praveen married Vamshitha | Sakshi
Sakshi News home page

Patas Praveen: ప్రియురాలితో పటాస్ ప్రవీణ్ పెళ్లి.. ఫైమా స్పెషల్ విషెస్

May 10 2026 12:14 PM | Updated on May 10 2026 1:49 PM

Tollywood Comedian Patas Praveen married Vamshitha

ప్రస్తుతం ఎక్కడ చూసిన పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. ఈ ఏడాదిలోనే పలువురు టాలీవుడ్ స్టార్స్ వివాహబంధంలోకి అడుగుపెట్టారు. రష్మిక, విజయ్ దేవరకొండ, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్లిబంధంలోకి అడుగుపెట్టారు. తాజాగా మరో టాలీవుడ్ కమెడియన్, పటాస్ ప్రవీణ్ పెళ్లి చేసుకున్నారు. తను ప్రేమించిన అమ్మాయి మెడలో మూడుముళ్లు వేశాడు. పలు ఆల్బమ్ సాంగ్స్‌లో చేసిన వంశిత అనే అమ్మాయిని పెళ్లాడారు. కాగా.. ఇటీవలే నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్న పలువురు సినీతారలు నూతన జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు. 
 
కాగా.. ప్రవీణ్ విషయాకొనిస్తే పటాస్, జబర్దస్త్ కామెడీ షోలతో గుర్తింపు తెచ్చుకున్నాడు. బుల్లితెరపై తన కామెడీ టైమింగ్‌తో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు.  జబర్దస్త్ కామెడీ షోలో ఫైమాతో కలిసి ప్రవీణ్ ఎక్కువగా కనిపించారు. వీరిద్దరు  కలిసి ఎన్నో స్కిట్స్ చేశారు. తాజాగా ఫైమా కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపింది. పెళ్లి రాలేకపోయినా వీడియో కాల్ ద్వారా విషెస్ చెప్పింది. ‘హ్యాపీ మ్యారీడ్ లైఫ్ రా ప్రవీణ్’ అంటూ  సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది. ఇది కాస్తా నెట్టింట వైర‌ల్‌గా మారింది.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement