‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్' మూవీ రివ్యూ | Mr Work From Home Movie Review And Rating In Telugu | Sakshi
Sakshi News home page

‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్' మూవీ రివ్యూ

May 15 2026 7:06 PM | Updated on May 16 2026 12:46 PM

Mr Work From Home Movie Review And Rating In Telugu

టైటిల్‌ : మిస్టర్‌ వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌
నటీనటులు: త్రిగుణ్, పాయల్ రాధాకృష్ణ & అనీష్ కురువిల్లా, శివాజీరాజా, హర్ష వర్ధన్, సత్య కృష్ణన్, హర్ష చెముడు, నెల్లూరు సుదర్శన్, సివిఎల్ నర్సింహారావు, గుండు సుదర్శన్, వేణు యెల్దండి, సప్తగిరి, గిరిధర్, సరయు, సత్తిపండు
దర్శకత్వం: మధుదీప్ చెలికాని
నిర్మాత: అరవింద్ మండెం
ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు
సంగీతం: ప్రకాష్ చెరుకూరి, అరుణ్ చిలువేరు 
విడుదల తేది: మే 15, 2026

కథేంటంటే.. 
అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేసే అరవింద్ (త్రిగుణ్).. తన జాబ్‌కి రాజీనామా చేసి స్వదేశానికి తిరిగివస్తాడు. ఇండియాకు తిరిగి వచ్చిన తర్వాత.. ఆర్గానిక్‌ వ్యవసాయం చేయాలని ఫిక్స్‌ అవుతాడు. వ్యవసాయంలో కొత్త తరహా పద్దతులను ప్రవేశపెట్టడమే కాకుండా రైతులు ఆదాయం పెంచేడానకి ‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’ అనే యాప్ తీసుకొస్తాడు. ఆ యాప్‌తో రైతుల జీవితం ఎలా మార్చాడు? మహి(పాయల్‌ రాధాకృష్ణ)తో ప్రేమాయాణం ఎలా సాగింది? చివరకు తాను అనుకున్న లక్ష్యాన్ని అరవింద్‌ ఎలా నెరవేర్చుకున్నాడు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎలా ఉందంటే.. 
‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’ అనే టైటిల్‌ చూడగానే ఇదేదో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి కథ అనుకుంటారు. కానీ ఇందులో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం వదిలేసి..వ్యవసాయం చేసుకునే యువకుడి కథను చెప్పాడు దర్శకుడు మధుదీప్‌ చెలికాని. అప్పట్లో ఎలాంటి ఎరువులు లేకుండా సాంప్రదాయ వ్యవసాయ పద్దతుల్లో పండించిన పంటలను తిన్న మన పెద్ద వాళ్లు ఎంతో ఆరోగ్యంగా  ఉండేవారు. కానీ నేటి తరం అలా ఉండటం లేదు. రసాయన ఎరువులు వాడిన కూరగాయలు, రైస్‌ తీసుకొని అనారోగ్యం బారిన పడుతున్నారు. ఆర్గానిక్‌ వ్యవసాయం వల్ల కలిగే లాభాల గురించి పెద్దగా తెలియదు. ఈ చిత్రంలో ఒకవైపు రైతుల కష్టాలను చూపిస్తూనే మరోవైపు  ఆర్గానిక్‌ వ్యవసాయం యొక్క ప్రాధాన్యతను తెలియజేశారు.

దర్శకుడు ఎంచుకున్న పాయింట్‌ బాగున్నా..దాన్ని తెరపై అనుకున్నట్లుగా చూపించడంలో కాస్త తడబడ్డాడు. దర్శకుడు పనితనం కొన్నిసన్నివేశాల్లో మాత్రం ఆకట్టుకునే విధంగా ఉంది. ఉన్నంతలో ఫస్టాఫ్‌ బాగానే ఉంటుంది. కొన్ని కామెడీ సీన్లు, లవ్‌ ఎపిసోడ్‌ పర్వాలేదు. కానీ సెండాఫ్‌లో కథనం స్లోగా సాగడంతో సాగదీశారనే ఫీలింగ్‌ కలుగుతుంది. క్లైమాక్స్‌లో ఇచ్చిన సందేశం ఆలోచింపజేస్తుంది.

ఎవరెలా చేశారంటే..
అరవింద్‌ పాత్రకి త్రిగుణ్‌ న్యాయం చేశాడు. ఎమోషనల్ సీన్స్ లో బాగా యాక్ట్ చేశాడు. హీరోయిన్ పాయల్ రాధాకృష్ణ అందంగా కనిపించింది. హీరో తండ్రి పాత్రలో నటించిన అవినాష్ కురువిల్లా, ఆర్గానిక్ వ్యవసాయం వైపు హీరోను టర్న్ చేసే పాత్రలో శివాజీ రాజా తమ పాత్రలకు న్యాయం చేశారు. మిగిలిన నటీనటులు తమ పరిది మేర నటించి ఆకట్టుకున్నారు.సాంకేతికంగా సినిమా పర్వాలేదు.

Rating:
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement