breaking news
Payal Radhakrishna
-
పరేడ్ గ్రౌండ్స్‌లో యోగా డే వేడుకలు.. ప్రముఖుల ఆసనాలు (ఫొటోలు)
-
‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్' మూవీ రివ్యూ
టైటిల్ : మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్నటీనటులు: త్రిగుణ్, పాయల్ రాధాకృష్ణ & అనీష్ కురువిల్లా, శివాజీరాజా, హర్ష వర్ధన్, సత్య కృష్ణన్, హర్ష చెముడు, నెల్లూరు సుదర్శన్, సివిఎల్ నర్సింహారావు, గుండు సుదర్శన్, వేణు యెల్దండి, సప్తగిరి, గిరిధర్, సరయు, సత్తిపండుదర్శకత్వం: మధుదీప్ చెలికానినిర్మాత: అరవింద్ మండెంఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావుసంగీతం: ప్రకాష్ చెరుకూరి, అరుణ్ చిలువేరు విడుదల తేది: మే 15, 2026కథేంటంటే.. అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసే అరవింద్ (త్రిగుణ్).. తన జాబ్‌కి రాజీనామా చేసి స్వదేశానికి తిరిగివస్తాడు. ఇండియాకు తిరిగి వచ్చిన తర్వాత.. ఆర్గానిక్ వ్యవసాయం చేయాలని ఫిక్స్ అవుతాడు. వ్యవసాయంలో కొత్త తరహా పద్దతులను ప్రవేశపెట్టడమే కాకుండా రైతులు ఆదాయం పెంచేడానకి ‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’ అనే యాప్ తీసుకొస్తాడు. ఆ యాప్‌తో రైతుల జీవితం ఎలా మార్చాడు? మహి(పాయల్ రాధాకృష్ణ)తో ప్రేమాయాణం ఎలా సాగింది? చివరకు తాను అనుకున్న లక్ష్యాన్ని అరవింద్ ఎలా నెరవేర్చుకున్నాడు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే.. ‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’ అనే టైటిల్ చూడగానే ఇదేదో సాఫ్ట్వేర్ ఉద్యోగి కథ అనుకుంటారు. కానీ ఇందులో సాఫ్ట్వేర్ ఉద్యోగం వదిలేసి..వ్యవసాయం చేసుకునే యువకుడి కథను చెప్పాడు దర్శకుడు మధుదీప్ చెలికాని. అప్పట్లో ఎలాంటి ఎరువులు లేకుండా సాంప్రదాయ వ్యవసాయ పద్దతుల్లో పండించిన పంటలను తిన్న మన పెద్ద వాళ్లు ఎంతో ఆరోగ్యంగా ఉండేవారు. కానీ నేటి తరం అలా ఉండటం లేదు. రసాయన ఎరువులు వాడిన కూరగాయలు, రైస్ తీసుకొని అనారోగ్యం బారిన పడుతున్నారు. ఆర్గానిక్ వ్యవసాయం వల్ల కలిగే లాభాల గురించి పెద్దగా తెలియదు. ఈ చిత్రంలో ఒకవైపు రైతుల కష్టాలను చూపిస్తూనే మరోవైపు ఆర్గానిక్ వ్యవసాయం యొక్క ప్రాధాన్యతను తెలియజేశారు.దర్శకుడు ఎంచుకున్న పాయింట్ బాగున్నా..దాన్ని తెరపై అనుకున్నట్లుగా చూపించడంలో కాస్త తడబడ్డాడు. దర్శకుడు పనితనం కొన్నిసన్నివేశాల్లో మాత్రం ఆకట్టుకునే విధంగా ఉంది. ఉన్నంతలో ఫస్టాఫ్ బాగానే ఉంటుంది. కొన్ని కామెడీ సీన్లు, లవ్ ఎపిసోడ్ పర్వాలేదు. కానీ సెండాఫ్లో కథనం స్లోగా సాగడంతో సాగదీశారనే ఫీలింగ్ కలుగుతుంది. క్లైమాక్స్‌లో ఇచ్చిన సందేశం ఆలోచింపజేస్తుంది.ఎవరెలా చేశారంటే..అరవింద్ పాత్రకి త్రిగుణ్ న్యాయం చేశాడు. ఎమోషనల్ సీన్స్ లో బాగా యాక్ట్ చేశాడు. హీరోయిన్ పాయల్ రాధాకృష్ణ అందంగా కనిపించింది. హీరో తండ్రి పాత్రలో నటించిన అవినాష్ కురువిల్లా, ఆర్గానిక్ వ్యవసాయం వైపు హీరోను టర్న్ చేసే పాత్రలో శివాజీ రాజా తమ పాత్రలకు న్యాయం చేశారు. మిగిలిన నటీనటులు తమ పరిది మేర నటించి ఆకట్టుకున్నారు.సాంకేతికంగా సినిమా పర్వాలేదు. -
‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’ చూస్తే మోదీ కూడా ప్రశంసిస్తారు
ఈషా ఫేం త్రిగుణ్, పాపం ప్రతాప్ ఫేం పాయల్ రాధాకృష్ణ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం 'మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్'. మధుదీప్ చెలికాని రచన, దర్శకత్వం వహించారు. లోటస్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై అరవింద్ మండెం నిర్మించారు. మే 15న సినిమా గ్రాండ్ గా థియేటర్స్ లో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు.ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో హీరో త్రిగుణ్ మాట్లాడుతూ.. మొన్ననే ప్రధాని మోదీ ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ చేయమని మళ్లీ ట్రెండ్ మొదలుపెట్టారు. ఆ రకంగా ఈ సినిమా మంచి ట్రెండ్‌లో వస్తోంది. ఐటీ జాబ్ వదిలేసిన ఓ కుర్రాడు వ్యవసాయం చేయాలనుకుంటే తన ఇంటి నుంచి, ఫ్యామిలీ నుంచి, అలాగే తన ప్రేమించిన అమ్మాయి నుంచి ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు, వాటిని ఎలా పరిష్కరించుకున్నాడు అనేది ఈ సినిమాలో చాలా వినోదాత్మకంగా చెప్పాం. తప్పకుండా అందరూ ఈ సినిమాను థియేటర్లలో చూసి ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను” అన్నారు.డైరెక్టర్ మధుదీప్ మాట్లాడుతూ. ఈ సినిమా ఓపెన్ మైండ్‌తో చూస్తే ఖచ్చితంగా మీకు నచ్చుతుందని నమ్మకంగా చెప్పగలుగుతున్నాను. అందరూ ఎంజాయ్ చేసే చిత్రమిది. ఈ సినిమాను ఆదరిస్తే ఒక మంచి సినిమాను సమాజానికి అందించిన వాళ్లం అవుతాం’ అన్నారు.నిర్మాత అరవింద్ మాట్లాడుతూ.. మన ప్రధాని మోదీ కూడా ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ చేయమని ప్రోత్సహిస్తున్నారు. మేము చాలా అడ్వాన్స్‌గా ఈ సినిమా తీశాం. ఈ సినిమాను ఆయన కూడా ప్రశంసిస్తారని నమ్మకం ఉంది. అందరికీ ఉపయోగపడే ఒక కాన్సెప్ట్ చెప్పాం. తప్పకుండా అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాను’ అని అన్నారు. ‘నేను సైన్ చేసిన ఫస్ట్ ప్రాజెక్ట్ ఇదే. ఈ సినిమాను చాలా ప్యాషన్‌తో చేశాను. తప్పకుండా మీరు అందరూ సపోర్ట్ చేసి మంచి విజయాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను’ అని హీరోయిన్ పాయల్ రాధాకృష్ణ అన్నారు. -
'మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
'రష్మిక బాటలో మరో హీరోయిన్.. నాకు తెలుగబ్బాయే కావాలి'
టాలీవుడ్ యంగ్ హీరో సుహాస్ మూవీ 'ప్రసన్న వదనం'తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కన్నడ బ్యూటీ పాయల్ రాధాకృష్ణ. ఆ తర్వాత చౌర్యపాఠం అనే చిత్రంలోనూ మెరిసింది. ఇటీవలే పాపం ప్రతాప్ మూవీతో ప్రేక్షకులను అలరించింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. ప్రస్తుతం పాయల్ మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా మే 15న థియేటర్లలో సందడి చేయనుంది. ప్రస్తుతం మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్న మేకర్స్ తాజాగా ప్రెస్‌మీట్ నిర్వహించారు.ఈ సందర్భంగా ప్రెస్‌మీట్‌కు హాజరైన పాయల్ రాధాకృష్ణ ఆసక్తికర కామెంట్స్ చేసింది. తాను కన్నడకు చెందిన వ్యక్తినే.. కానీ పెళ్లి విషయంలో మాత్రం తెలుగువాడే కావాలని బోల్డ్ కామెంట్స్ చేసింది. తనకు గుర్తింపు, గౌరవం, ఉపాధిని ఇచ్చింది టాలీవుడ్ పరిశ్రమనేనని తెలిపింది. తెలుగు ప్రేక్షకులు చూపించే ఆదరణ వల్లే తను ఈ స్థాయిలో ఉన్నానని పేర్కొంది. తెలుగు చిత్ర పరిశ్రమ తనకు ఆర్థిక భరోసాను ఇచ్చిందని వెల్లడించింది. అందుకే తన లైఫ్ పార్ట్నర్ కూడా తెలుగు వాడే కావాలని కోరుకుంటున్నట్లు పాయల్ వెల్లడించింది.ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కన్నడ బ్యూటీలంతా తెలుగింటి కోడలైపోతున్నారంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఏడాదిలోనే కన్నడ భామ రష్మిక మందన్నా.. మన తెలుగు హీరో విజయ్ దేవరకొండను పెళ్లాడిన సంగతి తెలిసిందే. తాజాగా మరో హీరోయిన్ పాయల్ రాధాకృష్ణ సైతం అదే బాటలో దూసుకెళ్తోంది. తెలుగబ్బాయినే పెళ్లి చేసుకుంటానని తన మనసులోని మాటను బయటకు చెప్పేసింది. తెలుగు కోడలిగా స్థిరపడాలన్న పాయల్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.


