గేమ్ ఛేంజర్‌తో భారీ డిజాస్టర్‌ను మూటగట్టుకున్న రామ్‌చరణ్ ఈసారి పెద్దితో హిట్ కొట్టేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే రిలీజైన పాటలు, టీజర్ సినిమాపై అంచనాల్ని భారీగా పెంచేశాయి. బుచ్చిబాబు దర్శకత్వం వహించిన ఈ మూవీ జూన్ 4న విడుదల కానుంది. అయితే అప్పటివరకు గ్యాప్ లేకుండా భారీ ఈవెంట్లు ప్లాన్ చేసింది చిత్రయూనిట్.
బ్యాండేజ్‌తో చరణ్?
మే 18న ముంబైలో ట్రైలర్ లాంచ్‌తో ఈ ప్రమోషన్స్ జర్నీ మొదలు కానుంది. పలు నగరాల్లో అనేక ఈవెంట్లను ఏర్పాటు చేశారు. చివరగా జూన్ 2న హైదరాబాద్‌లో ప్రీరిలీజ్ ఫంక్షన్ జరగనుంది. ఈ క్రమంలోనే ముంబై వెళ్లిన రామ్‌చరణ్ చేతికి బ్యాండేజ్‌తో కనిపించాడు. శుక్రవారం నాడు ప్రముఖ బాలీవుడ్ సెలబ్రిటీ హెయిర్ స్టయిలిస్ట్ హకీం ఆలిం సెలూన్‌కు వెళ్లాడు చరణ్.

చరణ్‌కు ఏమైంది?
అనంతరం బయటకు వస్తుండగా అతడి కుడి చేతికి సపోర్ట్ బ్రేస్ (రిస్ట్ బ్యాండేజ్) ఉంది. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో చరణ్‌కు ఏమైందని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అయితే షూటింగ్‌లో చరణ్ చేతికి చిన్న గాయమైందని, దాన్నుంచి త్వరగా కోలుకోవడానికే ఈ బ్యాండేజ్ ధరించాడని తెలుస్తోంది.
#RamCharan - MAINTAINING HOLLYWOOD STAR LEVEL OF LOOKS - and Ram Charan is absolutely owning that long hair look🔥#ramcharan 💥 pic.twitter.com/SJ5IW73K9j
— ROYAL BHARAT (INDIAN)🇮🇳 (@royal_mogile) May 16, 2026


