అబ్బే.. స్క్రిప్ట్‌ చదివే అలవాటు నాకెక్కడిది?: సల్మాన్‌ ఖాన్‌ | Salman Khan Reveals He Never Reads Scripts In His Career, Calls Himself A Gut-Driven Actor | Sakshi
Sakshi News home page

Salman Khan: కథ చదివే అలవాటు లేదు.. నాకదే ముఖ్యం!

May 16 2026 8:35 AM | Updated on May 16 2026 10:20 AM

Salman Khan reveals he Never Read a Script in his Entire Career

బాలీవుడ్‌ భాయ్‌జాన్‌ సల్మాన్‌ ఖాన్‌ చిత్రపరిశ్రమకు ఎన్నో ఇండస్ట్రీ హిట్లు, బ్లాక్‌బస్టర్లు అందించాడు. తన కెరీర్‌లో ఎన్నో విజయాలు చూసిన ఈ స్టార్‌ హీరోకు అసలు స్క్రిప్ట్‌ చదివే అలవాటే లేదట! ఈ విషయాన్ని తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. వెరైటీ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సల్మాన్‌ మాట్లాడుతూ.. నా జీవితం మొత్తంలో ఒక్కసారి కూడా స్క్రిప్ట్‌ చదివిందే లేదు. కొన్నిసార్లు నేనే స్క్రిప్ట్‌ రాశాను కానీ ఎన్నడూ చదివిన పాపాన పోలేదు అని నవ్వుతూ చెప్పాడు. 

అదన్నమాట సంగతి!
గతంలోనూ సల్మాన్‌ ఈ విషయాన్ని చూచాయగా చెప్పాడు. తనకు కథ కన్నా దాని స్వభావం, అందులోని కమర్షియల్‌ అంశాలే ముఖ్యమన్నాడు. ఇక ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు కొందరు అతడి నిజాయితీని మెచ్చుకుంటున్నారు. మరికొందరేమో అందుకే సల్మాన్‌ వరుస వైఫల్యాలు అందుకుంటున్నారని, ఇకనైనా ఈ ధోరణి మార్చుకుని మంచి కథలు ఎంచుకుంటే తిరిగి ట్రాక్‌ ఎక్కుతాడని హితవు పలుకుతున్నారు.

సినిమా
ప్రస్తుతం సల్మాన్‌ ఖాన్‌ మాతృభూమి సినిమా చేస్తున్నాడు. దేశభక్తి నేపథ్యంలో సాగే ఈ మూవీలో సైనికాధికారిగా నటిస్తున్నాడు. అపూర్వ లఖియా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను సల్మాన్‌ ఖాన్‌ నిర్మిస్తున్నాడు. దీనికి మొదట బ్యాటిల్‌ ఆఫ్‌ గాల్వాన్‌ అనే టైటిల్‌ ఫిక్స్‌ చేశారు. పలు కారణాల వల్ల దాన్ని మాతృభూమిగా మార్చారు. అలాగే సల్మాన్‌.. తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లితో ఓ మూవీ చేస్తున్నాడు. నయనతార కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఈద్‌కు విడుదల కానుంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement