ది రాజాసాబ్‌పై కామెంట్స్‌.. సప్తగిరి క్షమాపణలు! | Tollywood Comedian Saptagiri Apology To The Rajasaab Movie Comments | Sakshi
Sakshi News home page

Saptagiri: ది రాజాసాబ్‌పై కామెంట్స్‌.. సప్తగిరి సారీ!

May 15 2026 5:50 PM | Updated on May 15 2026 6:57 PM

Tollywood Comedian Saptagiri Apology To The Rajasaab Movie Comments

టాలీవుడ్‌లో కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకున్నవారిలో సప్తగిరి ఒకరు. ఆ తర్వాత హీరోగా కొన్ని సినిమాల్లో కనిపించారు. ప్రస్తుతం పురుషః అనే మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఈ సినిమా మే 22 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మూవీటీమ్ ప్రెస్‌ మీట్ నిర్వహించారు.

ఈవెంట్‌కు హాజరైన సప్తగిరి తన కెరీర్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తాను చేసిన చిన్న సినిమాల గురించి చెప్పే క్రమంలో అనుకోకుండా ది రాజాసాబ్‌ పేరును కూడా కలిపేశారు. ఈ మధ్యే  సరస్వతి, ది రాజాసాబ్, కొక్కరొక్కో లాంటి సినిమాలు చేశాను. కాకపోతే అవి చిన్నస్థాయి సినిమాలు కావడంతో సరిగ్గా ప్రజలకు రీచ్ అవ్వడం లేదు. పెద్ద సినిమాలు అయితే రీచ్ ఉంటుందని చెప్పుకొచ్చాడు.  దీంతో రెబల్ స్టార్ ఫ్యాన్స్‌ బాగా ఫీలయ్యారు. సప్తగిరిపై సోషల్ మీడియాలో ట్రోల్స్ చేశారు.

తాజాగా తాను చేసిన కామెంట్స్‌పై సప్తగిరి స్పందించారు. అలా మాట్లాడినందుకు నన్ను క్షమించాలని కోరారు. మినిమం బడ్జెట్‌ మూవీస్ చేస్తున్నాను.. ఆ సినిమాల లిస్ట్ చెబుతూనే ది రాజాసాబ్‌ పేరు చెప్పానని తెలిపారు. మారుతి కూడా నాకు ఫోన్ చేశారని.. సారీ చెప్పమని అడిగారని వెల్లడించారు. ఆయనకు కూడా సారీ చెప్పా.. ఇప్పుడు ఫ్యాన్స్ అందరికీ కూడా క్షమాపణలు చెప్పారు సప్తగిరి.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement