'నమ్మి డబ్బులిస్తే మోసం చేశారు'.. సంజనా షాకింగ్ కామెంట్స్ | Sanjjanaa Galrani allegations On Tollywood Producer money fraud | Sakshi
Sakshi News home page

Sanjjanaa Galrani: 'టాలీవుడ్ నిర్మాత చేతిలో మోసపోయా'.. సంజనా షాకింగ్ కామెంట్స్

May 10 2026 4:42 PM | Updated on May 10 2026 4:47 PM

Sanjjanaa Galrani allegations On Tollywood Producer money fraud

సంజనా గల్రానీ.. ఈ పేరు గురించి తెలుగువారికి పెద్దగా పరిచయం అక్కర్లేదు. ప్రభాస్ హీరోగా నటించిన బుజ్జిగాడు మూవీలో అలరించిన ఈ బ్యూటీ.. ప్రస్తుతం పెద్దగా సినిమాలేవీ చేయట్లేదు. గతేడాది తెలుగు బిగ్‌బాస్ సీజన్‌-9లో మెరిసింది. ఏకంగా టాప్-5 నిలిచిన ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో హీరోయిన్‌గా చేసిన ఈ ముద్దుగుమ్మ.. తాజాగా ఓ టాక్‌ షోకు హాజరైంది. ఈ సందర్భంగా తనకెదురైన అనుభవాలను పంచుకుంది.

తాజా ఇంటర్వ్యూలో సంజనా షాకింగ్ కామెంట్స్ చేసింది. టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఓ నిర్మాత తనను మోసం చేశాడని చెప్పుకొచ్చింది. నేను కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచే వచ్చానని.. నాకు తెలిసిన వాళ్లను నమ్మి దాదాపు రెండు కోట్లు మోసపోయానని తెలిపింది. నన్ను మోసం చేసిన వారిలో తెలుగు ఇండస్ట్రీకి చెందిన ఓ పెద్ద నిర్మాత కూడా ఉన్నారని వెల్లడించింది. ఇప్పటికీ కూడా ఆ చెక్ బౌన్స్ కేసులు ఇంకా నడుస్తున్నాయని సంజనా గల్రానీ తెలిపింది. ఇప్పుడు ఎవరైనా నన్ను డబ్బులు అడిగితే మాత్రం ఇవ్వట్లేదని వెల్లడించింది. అయితే తనకు డబ్బులు ఎగ్గొట్టిన నిర్మాత ఎవరనేది మాత్రం రివీల్ చేయలేదు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement