శర్వానంద్–శ్రీను వైట్ల క్రేజీ కాంబో.. హీరోయిన్‌గా మానస! | Manasa Varanasi to Act With Sharwanand in Srinu Vaitla Film | Sakshi
Sakshi News home page

శర్వానంద్–శ్రీను వైట్ల క్రేజీ కాంబో.. హీరోయిన్‌గా మానస!

May 13 2026 11:54 PM | Updated on May 14 2026 12:14 AM

Manasa Varanasi to Act With Sharwanand in Srinu Vaitla Film

శర్వానంద్ వరుస విజయాలతో దూసుకుపోతూ ఇప్పుడు కామెడీ కింగ్ శ్రీను వైట్లతో కొత్త ప్రాజెక్ట్‌ను ఖరారు చేశారు. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో కూడిన ఈ సినిమా వినోదానికి సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్స్ జోడించబోతున్నట్లు సమాచారం. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత అనిల్ సుంకర నిర్మాణంలో జులై 2026 నుంచి షూటింగ్ ప్రారంభమై వచ్చే సంక్రాంతికి విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

ఈ చిత్రంలో శర్వానంద్ సరసన నటించబోయే హీరోయిన్‌గా మొదట పూజా హెగ్డే, మమితా బైజు వంటి స్టార్ హీరోయిన్ల పేర్లు ప్రచారంలోకి వచ్చినా తాజా సమాచారం ప్రకారం ‘మిస్ ఇండియా’ రన్నరప్ మానస వారణాసి ఎంపికైనట్లు టాలీవుడ్ టాక్. ఇటీవల ‘కపుల్ ఫ్రెండ్లీ’ సినిమాలో తన నటనతో మానస మంచి గుర్తింపు తెచ్చుకుంది. దాంతో మానస, శర్వాతో జోడీ కట్టడం ఫ్రెష్ ఫీల్‌ను తెస్తుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ తుది దశలో ఉంది. త్వరలోనే హీరోయిన్‌తో పాటు ఇతర సాంకేతిక నిపుణుల వివరాలను అధికారికంగా ప్రకటించనున్నారు.

ప్రస్తుతం సంపత్ నంది దర్శకత్వంలో 1960ల నాటి పీరియడ్ డ్రామా ‘భోగి’ షూటింగ్‌లో శర్వానంద్ బిజీగా ఉన్నారు. ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయతి కథానాయికలుగా నటిస్తున్నారు. ఉత్తర తెలంగాణ - మహారాష్ట్ర ప్రాంతాలతో ముడిపడిన ఈ పీరియాడిక్‌ స్టోరీని పాన్‌ ఇండియా రేంజ్‌లో నిర్మిస్తున్నారు. ఇందులో రోహిత్ పాఠక్ కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కె.కె. రాధామోహన్ నిర్మించిన ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. 'భోగి' చిత్రం ఆగష్టు 28, 2026న థియేటర్లలో విడుదల కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement