నా చిన్నప్పటి రోజులు గుర్తొచ్చాయి: ప్రియదర్శి | Priyadarshi Pulikonda Speech at Dooradarshini Pre Release Event | Sakshi
Sakshi News home page

నా చిన్నప్పటి రోజులు గుర్తొచ్చాయి: ప్రియదర్శి

May 15 2026 12:16 AM | Updated on May 15 2026 12:16 AM

Priyadarshi Pulikonda Speech at Dooradarshini Pre Release Event

సువీక్షిత్, ప్రియదర్శి

‘‘దూరదర్శని’ సినిమా ట్రైలర్‌ చూడగానే నా చిన్నప్పటి రోజులు గుర్తొచ్చాయి. ఆ రోజుల్లో అందరికీ ప్రపంచాన్ని పరిచయం చేసింది దూరదర్శని. నేను కూడా చిన్నప్ప్పుడు దూరదర్శని చానల్‌లో సినిమాలు చూసి, స్ఫూర్తి పొంది నటుడిగా మారాను. 

ఈ చిత్రం తప్పకుండా ప్రేక్షకుల హృదయాలను హత్తుకోవడంతో పాటు మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అని హీరో ప్రియదర్శి చెప్పారు. సువీక్షిత్, గీతిక జంటగా కార్తికేయ కొమ్మి దర్శకత్వం వహించిన చిత్రం ‘దూరదర్శిని’. వారాహ మూవీ మేకర్స్‌పై జయశంకర్‌ రెడ్డి .ఎం, పాటిమీది సంతోష్‌ నిర్మించిన ఈ చిత్రం నేడు రిలీజ్‌ అవుతోంది. ఈ మూవీ ప్రీ రిలీజ్‌ వేడుకకు ప్రియదర్శి, ‘రాజు వెడ్స్‌ రాంబాయి’ చిత్రదర్శకుడు సాయి కంపాటి అతిథులుగా హాజరయ్యారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement