నిజ జీవిత స్ఫూర్తితో పుట్టిన ‘పెద్ది’ | Why Ram Charan Peddi Movie Got Its Title, Buchi Babu Reveals Real Life Inspiration Behind Rural Sports Drama | Sakshi
Sakshi News home page

నిజ జీవిత స్ఫూర్తితో పుట్టిన ‘పెద్ది’

May 17 2026 11:32 PM | Updated on May 18 2026 10:50 AM

Ram Charan Peddi Movie Title inspired by real life

మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ హీరోగా, జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా వస్తోన్న రూరల్ స్పోర్ట్స్ డ్రామా పెద్ది. తాజాగా ఈ చిత్ర దర్శకుడు బుచ్చిబాబు ‘పెద్ది’ సినిమా టైటిల్ వెనక ఉన్న ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన పెద్దిరాజు అనే వ్యక్తి నుంచి ఈ టైటిల్ పుట్టిందని ఆయన తెలిపారు. పెద్దిరాజు తాపీ పని చేస్తూనే క్రికెట్, బాస్కెట్‌బాల్ బాగా ఆడేవారు. తనది పేద కుటుంబం కావడంతో ఎవరు డబ్బు ఇస్తే వాళ్ల తరఫున ఆడేవాడట. ఆయన జీవితం నుంచి స్ఫూర్తి పొంది కథను రాసుకున్నానని బుచ్చిబాబు చెప్పారు. అయితే ఈ సినిమా బయోపిక్ కాదు. నిజజీవితం నుంచి స్ఫూర్తిపొంది, దానికి కొంత ఫిక్షన్ కూడా జోడించి కథను రూపొందించానని ఆయన స్పష్టం చేశారు.  


అలా టైటిల్ కోసం పెద్దిరాజు పేరులోని ‘పెద్ది’ అనే పదాన్ని ఎంచుకున్నాను.ఇది కోడి రామ్మూర్తి బయోపిక్ అని, జూ.ఎన్టీఆర్ కోసం రాసిన కథ అని వస్తున్న పుకార్లను బుచ్చిబాబు ఖండించారు. ఉప్పెన రిలీజ్‌కు ముందే ఈ కథ రాసుకున్నానని ఆయన క్లారిటీ ఇచ్చారు. మొదట ఈ సినిమాను గోదావరి యాసలో తీద్దామనుకున్నాను. అయితే ఇప్పటికే రామ్‌ చరణ్‌ తన గురువు సుకుమార్‌ దర్శకత్వంలో చేసిన 'రంగస్థలం' ఆ నేపథ్యమే కావడంతో తన సినిమా ‘పెద్ది’ కోసం విజయనగరం బ్యాక్‌డ్రాప్‌ను ఎంచుకున్నానని దర్శకుడు వెల్లడించారు. మెగా ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తోన్న రూరల్ స్పోర్ట్స్ డ్రామా పెద్ది. బుచ్చిబాబు డైరెక్షన్‌లో వస్తోన్న ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. 

ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీకపూర్‌ హీరోయిన్‌గా కనిపించనుంది. ఈ మూవీలో స్పెషల్‌ సాంగ్‌లో శృతిహాసన్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలవనుంది. ఇక ఈ చిత్రంలో జగపతిబాబు, శివరాజ్ కుమార్ కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ సంగీతమందించారు. ‘పెద్ది’ సినిమా ట్రైలర్‌ను ఈ నెల 18న గ్రాండ్ రిలీజ్ చేయనున్నారు. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ఈ చిత్రం సందడి చేయనుంది. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement