ప్రభాస్ vs వివేక్ ఒబెరాయ్.. 'స్పిరిట్'కి సందీప్ వంగా వైలెంట్ ట్రీట్ | Prabhas vs Vivek Oberoi Sandeep Vanga Violent Treat for Spirit | Sakshi
Sakshi News home page

ప్రభాస్ vs వివేక్ ఒబెరాయ్.. 'స్పిరిట్'కి సందీప్ వంగా వైలెంట్ ట్రీట్

May 10 2026 11:36 PM | Updated on May 11 2026 8:14 AM

Prabhas vs Vivek Oberoi Sandeep Vanga Violent Treat for Spirit

ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'స్పిరిట్'. ఈ సినిమా నుంచి ఒక క్రేజీ అప్‌డేట్ బయటకొచ్చింది. త్వరలోనే ఒక కీలకమైన షూటింగ్ షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్‌లో ప్రభాస్, విలన్ పాత్రధారి వివేక్ ఒబెరాయ్ మధ్య జరిగే యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. అయితే కేవలం ఈ యాక్షన్ సీక్వెన్స్‌ల కోసమే సుమారు రెండు నెలల పాటు సుదీర్ఘంగా షూటింగ్ జరగనుందని సమాచారం.  

సందీప్ వంగా గతంలో 'యానిమల్‌'లో హీరో-విలన్ పోరాట సన్నివేశాలను ఎంత పవర్‌ఫుల్‌గా చూపించాడో అందరికీ తెలిసిందే. అదే తరహాలో 'స్పిరిట్'లో కూడా యాక్షన్ సన్నివేశాలకు ప్రత్యేకంగా రెండు నెలల సమయం కేటాయించారు. దాంతో ఈ సినిమా ఎంత భారీ స్థాయిలో తెరకెక్కుతుందో తెలుస్తోంది.  

ఈ చిత్రంలో ప్రభాస్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఆయన సరసన త్రిప్తి దిమ్రి హీరోయిన్‌గా నటిస్తోంది. కాగా ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్‌ను టీ-సిరీస్, భద్రకాళి పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సంగీతాన్ని హర్షవర్ధన్ రామేశ్వర్ అందిస్తున్నారు.  
 

Advertisement
 
Advertisement
Advertisement