బర్త్‌డే స్పెషల్‌.. సాయి పల్లవికి ఎన్ని భాషలు వచ్చో తెలుసా? | Sai Pallavi Birthday Special: Interesting Facts About The Actress | Sakshi
Sakshi News home page

బర్త్‌డే స్పెషల్‌.. సాయి పల్లవి గురించి 10 ఆసక్తికర విషయాలు

May 9 2026 9:20 AM | Updated on May 9 2026 9:44 AM

Sai Pallavi Birthday Special: Interesting Facts About The Actress

తనదైన నటన, డ్యాన్స్‌తో సౌత్‌ ఇండస్ట్రీలో  తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్‌ సాయిపల్లవి.ఎక్స్‌పోజింగ్‌కు దూరంగా ఉంటూ కేవలం తన నటనతోనే ​లక్షలాది మంది అభిమానులను సంపాధించుకుంది.ఈ రోజు(మే 9) ఈ నేచురల్‌ బ్యూటీ పుట్టిన రోజు. ఈ సందర్భంగా సాయి పల్లవి గురించి 10 ఆసక్తికర విషయాలు. 

1) సాయి పల్లవి పూర్తి పేరు సాయి పల్లవి సెంథామరై కన్నమ్‌. 1992 మే 9న తమిళనాడులోని కోటగిరిలో జన్మించింది. తల్లి రాధామణి పుట్టపర్తి సాయిబాబా భక్తురాలు కావడంతో ఆమె పేరులో సాయి చేర్చింది. ఈమె, చెల్లెలు పూజ కవల పిల్లలు. జార్జియాలోని ప్రముఖ యూనివర్సీటీలో ఎంబీబీఎస్‌ చదివింది.

2) ఎనిమిదో తరగతిలో ఉండగా ఈమె నాట్యం చూసిన ఓ దర్శకుడు ధూం ధాం అనే తమిళ సినిమాలో కథానాయిక కంగనా రనౌత్ పక్కన చిన్న పాత్రలో అవకాశమిచ్చాడు.

3) సాయి పల్లవి మాతృభాష బడగ. ఆమెకు బడగ భాషతో పాటు తెలుగు, తమిళ, హిందీ, మలయాళం,ఇంగ్లీష్‌, జార్జియన్‌  భాషలు వచ్చు. ఇండస్ట్రీలో ఏ హీరోయిన్‌కి ఇన్ని భాషలు రావు.

4) 2015లో విడుదలైన ‘ప్రేమమ్’ సినిమాతో సాయి పల్లవి తన సినీ కెరీర్ ను ప్రారంభించింది.

5) 2009లో తెలుగులో ఢీ షోలో పాల్గొని ఫైనల్‌ వరకు వెళ్లింది. కసూర్తి మాన్‌(2005), ధామ్‌ ధూమ్‌(2008) సినిమాల్లో జూనియర్‌ ఆర్టిస్ట్‌గా చేసింది

 6) ఫిదా చిత్రంతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చి..తొలి సినిమాతోనే భారీ హిట్‌ అందుకుంది. ఇందులో అచ్చం తెలుగింటి అమ్మాయిలా కనిపించి ఆకట్టుకుంది పల్లవి. ఈ సినిమాలో సాయిపల్లవి తెలంగాణ యాసలో మాట్లాడుతూ ప్రేక్షకులను ఫిదా చేసింది.

7) సాయి పల్లవి మిగతా హీరోయిన్లలా గ్లామరస్‌ రోల్స్‌ చేయదు. అలాగే ఎన్ని కోట్లు ఇస్తామన్నా సరే బ్యూటీ ప్రొడక్ట్స్‌ని అడ్వర్టైజ్‌ చేయదు. ఈ విషయాన్ని ఆమె గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పింది.

8) సాయి పల్లవి డాక్టర్ కావాలనుకుంది. అయితే క్రమంగా ఆమెకు నటనపై ఆసక్తి పెరిగింది. దాంతో సినిమాల్లో నటించాలని నిర్ణయించుకుంది.

9) సాయి పల్లవి సోదరి పూజా కన్నన్ కూడా గతంలో ఓ తమిళ సినిమాలో నటించింది. 2024లో ఆమె వివాహం జరిగింది.

10) ప్రస్తుతం నితీష్‌ తివారీ తెరకెక్కిస్తున్న పాన్‌ ఇండియా మూవీ ‘రామాయణ’లో సీతగా నటిస్తోంది. రాముడి పాత్రను రణ్‌బీర్‌ కపూర్‌ పోషిస్తున్నాడు. 

👉:​​​​​​​ (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement