చిరంజీవి 'విశ్వంభర'.. జూలై కాదు.. ఆ తేదీ ఫిక్స్? | Megastar Chiranjeevi Vishwambhara Movie New Release Date Goes Viral On Social Media Amid VFX Delays | Sakshi
Sakshi News home page

Vishwambhara Movie: చిరంజీవి 'విశ్వంభర'.. రిలీజ్‌ డేట్ ఫిక్స్..!

May 11 2026 7:34 PM | Updated on May 11 2026 8:55 PM

Megastar Chiranjeevi Vishwambhara Movie New Release Date Goes Viral

మెగాస్టార్ హీరోగా వస్తోన్న సోషియో ఫాంటసీ మూవీ విశ్వంభర. ఈ మూవీ కోసం మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం వీఎఫ్ఎక్స్‌ వర్క్స్ వల్ల మరింత ఆలస్యమవుతూ వస్తోంది. సుమారు రెండేళ్లుగా ఈ చిత్రం కోసం ఫ్యాన్స్‌ ఎదురుచూస్తున్నారు. టీజర్‌పై విమర్శలు రావడంతో  చిత్ర నిర్మాతలు విఎఫ్ఎక్స్‌పై ఎక్కువ సమయం కేటాయించడంతో విడుదల విషయంలో జాప్యం జరుగుతోంది. ఈ సినిమా సమ్మర్‌లోనే విడుదలవుతుందని భావించినప్పటికీ అలా జరగలేదు. ఆ తర్వాత జూలైలో ప్రేక్షకుల ముందుకు రానుందని టాక్ వినిపించింది.

అయితే విశ్వంభరకు రిలీజ్‌ తేదీకి సంబంధించిన మరో న్యూస్ వైరలవుతోంది. ఈ మూవీని ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారని టాక్ వినిపిస్తోంది. ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఆగస్టు 15న రిలీజ్ చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నారని తాజా సమాచారం. ఆ సమయంలో పెద్దగా సినిమాల పోటీ లేకపోవడం విశ్వంభరకు ప్లస్ అవుతుందని మేకర్స్ భావిస్తున్నారట. ఇదే నిజమైతే స్వాతంత్ర్య దినోత్సవం రోజున విశ్వంభర రావడం ఖాయంగా కనిపిస్తోంది.

ఇక ఇప్పటికే విశ్వంభర్ రెండు పార్టులుగా వస్తుందన్న వార్తలపై డైరెక్టర్ వశిష్ట స్పందించారు. అలాంటిదేమీ లేదని దర్శకుడు కొట్టిపారేశాడు. ప్రస్తుతం ఈ సినిమా డిజిటల్ డీల్‌ను క్లోజ్ చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే అఫీషియల్‌గా రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేసే అవకాశముంది. కాగా.. ఈ సినిమాకు ఎం.ఎం. కీరవాణి సంగీతం అందించారు. ఈ మూవీలో మెగాస్టార్ సరసన త్రిష హీరోయిన్‌గా కనిపించనుంది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement