తెరపై ఎంత గ్లామర్ చూపించినా సరే కొందరు హీరోయిన్లకు భక్తి కూడా అలానే ఉంటుంది. సమంత లాంటి వాళ్లు ఎప్పటికప్పుడు ఈషా ఫౌండేషన్‌లోని ఆదియోగిని దర్శించుకుంటూనే ఉంటారు. మీనాక్షి చౌదరి లాంటి హీరోయిన్లు తిరుమలలో ఎప్పటికప్పుడు కనిపిస్తూనే ఉంటారు. ఇప్పుడు స్టార్ హీరోయిన్ తమన్నా కూడా మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని మహాకాళేశ్వరుడిని దర్శించుకుంది. వేకువజామున జరిగే భస్మ హారతి కార్యక్రమంలోనూ పాల్గొంది. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 14 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)
మహాకాళేశ్వర ఆలయంలో ప్రతి ఉదయం విశిష్టమైన భస్మ హారతి కార్యక్రమం జరుగుతుంది. ఇందులో శివలింగాన్ని పవిత్రమైన భస్మంలో ముంచుతారు. ఈ ఆచారం హిందూ పురాణాలలోని ముఖ్యమైన అంశాలైన జననం, మరణం, పునర్జన్మ అనే శాశ్వత చక్రాన్ని సూచిస్తుంది. నాశనం చేసి పునరుద్ధరించగల శివుని పరివర్తన సామర్థ్యాన్ని నొక్కి చెప్పడానికి, ఆత్మ శాశ్వత స్వభావాన్ని తెలియజేయడానికి భస్మాన్ని ఉపయోగిస్తారు. ఇది భక్తులకు శివునికి మధ్య ఓ అనుబంధాన్ని ఏర్పరుస్తుందని ఓ నమ్మకం.
(ఇదీ చదవండి: రూ.200-300 కోట్ల కలెక్షన్స్ వస్తాయనుకున్నా.. కానీ)
🔸બોલિવુડ અભિનેત્રી તમન્ના ભાટિયાએ મહાકાલેશ્વર મંદિરની ભસ્મ આરતીનો લીધો લ્હાવો@tamannaahspeaks #TamannaahBhatia #Mahakal #BhasmaAarti #Ujjain #Mahadev #HarHarMahadev #BollywoodNews pic.twitter.com/03f3a78BOI
— DD News Gujarati (@DDNewsGujarati) May 12, 2026


