సూర్య వశిష్ట, దీప్షిక హీరో, హీరోయిన్లుగా నటిస్తోన్న లేటేస్ట్ మూవీ రమణి కల్యాణం. ఈ ఎమోషనల్ డ్రామాకు విజయ్ ఆదిరెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని కైట్స్ క్రియేటివ్స్ బ్యానర్‌పై విజయ్ ఆదిరెడ్డి, మనోజ్ చింతిరెడ్డి. శ్రీనాథ్ పసుపులేటి, సంజయ్ వెంపరాల నిర్మిస్తున్నారు. కోర్ట్ మూవీ ఫేం రామ్ జగదీష్ డైలాగ్స్, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. సీనియర్ నటి జయసుధ చేతుల మీదుగా విడుదల చేశారు.
ఈ సందర్భంగా జయసుధ మాట్లాడుతూ..'అందరికీ నమస్కారం. ఈ సినిమా నిర్మించిన నిర్మాతలకు అభినందనలు. ఈ సినిమాలో హీరో, హీరోయిన్‌లు అద్భుతంగా నటించారు. విజయ్ చాలా ప్యాషన్‌తో ఈ సినిమా తీశాడు. ఇది ఒక బ్యూటిఫుల్ ఫిల్మ్. ఈ మధ్యకాలంలో చిన్న సినిమాల్లో కూడా చాలా మంచి చిత్రాలు వస్తున్నాయి. ‘రమణి కళ్యాణం’ కూడా అలాంటి సినిమానే. మ్యూజిక్ కూడా చాలా అద్భుతంగా వచ్చింది. ఇది ఒక మంచి ఫీల్‌గుడ్ మూవీ. మే 22న ఈ సినిమా విడుదల అవుతోంది. అందరూ థియేటర్స్‌లో చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా' అని అన్నారు.
డైరెక్టర్ విజయ్ ఆదిరెడ్డి మాట్లాడుతూ.. 'అందరికీ నమస్కారం. ఇది మంచి టీమ్ సపోర్ట్‌తో చేసిన సినిమా. ఈ కథను నమ్మి పనిచేసిన అందరికీ థ్యాంక్స్. హీరో, హీరోయిన్‌లు చాలా ప్యాషన్‌తో సహజంగా పాత్రల్లో ఒదిగిపోయారు. ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. రామ్ జగదీశ్ నా ఫ్రెండ్. ఈ సినిమాలో ఆయన చాలా చక్కని మాటలు రాశారు. నా రైటింగ్ టీమ్ అందరికీ థ్యాంక్యూ. సినిమాలు థియేటర్స్‌లోనే చూడాలి. ఆ అనుభూతి వేరు. అందరూ సినిమాలను థియేటర్స్‌లో చూసి ఆదరించాలని కోరుకుంటున్నాను. మాకు ఎంతో సపోర్ట్ చేసిన జయసుధ గారికి ప్రత్యేక ధన్యవాదాలు' తెలిపారు. ఈ చిత్రంలో శ్రీనివాస్ రెడ్డి, శ్యామల, చైతు జొన్నల గడ్డ కీలక పాత్రల్లో నటించారు.


