ఎక్కువ సినిమాలు చేసింది ఎవరు? బ్రహ్మీ స్థానమెంత? | Special Story On Who Holds The Record For Acting In The Most Films? The Answer Will Surprise You | Sakshi
Sakshi News home page

Most Movies Actor: ఆ యాక్టర్ అన్ని వేల సినిమాలు చేశారా?

May 12 2026 3:09 PM | Updated on May 12 2026 3:35 PM

Who Was Most Movies Actor Actress India

ఒకప్పటితో పోలిస్తే మన దేశానికి సంబంధించిన వివిధ భాషల సినిమాలు, నటీనటులు.. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంటున్నారు. అదే టైంలో యాక్టర్స్ ఎక్కువైపోవడం వల్ల కెరీర్ మొత్తంలో మహా అయితే పదుల సంఖ్యలో లేదంటే వందల్లో మాత్రమే మూవీస్ చేస్తున్నారు. కానీ కొందరు నటీనటులు మాత్రం వేల చిత్రాల్లో నటించి ఎవరికీ సాధ్యం కాని రికార్డ్ సృష్టించారు. ఇంతకీ ఎక్కువ చిత్రాల్లో కనిపించిన నటి/నటుడు ఎవరంటే?

(ఇదీ చదవండి: ఓటీటీలో కోర్ట్ రూమ్ థ్రిల్లర్ సినిమా.. ట్రైలర్ రిలీజ్)

సుకుమారి
మలయాళ చిత్రసీమకు చెందిన ఈమె.. 1940లో పుట్టి 2013లో చనిపోయారు. దక్షిణాది భాషలతో పాటు హిందీ, సింహళ, ఫ్రెంచ్, ఇటాలియన్, బెంగాలీ, తుళు, ఇంగ్లీష్ భాషల్లో కలిపి మొత్తంగా 2500కి పైగా సినిమాల్లో కనిపించారు. ఈమెనే ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉంది.

మనోరమ
గోపిశాంత అలియాస్ మనోరమ స్వతహాగా తమిళ నటి. 1500కి పైగా సినిమాల్లో కనిపించిన ఈమె 5000కి పైగా నాటకాల్లోనూ వివిధ పాత్రలు పోషించారు. అలానే అన్నాదురై, కరుణానిధి, జయలలిత, ఎమ్జీఆర్, స్టాలిన్, ఎన్టీఆర్, విజయ్ లాంటి ఏడుగురు ముఖ్యమంత్రులతో కలిసి నటించిన ఘనత ఈమె సొంతం.

జగతి శ్రీకుమార్
మలయాళ ఇండస్ట్రీకి చెందిన నటుడు, దర్శకుడు, సింగర్ అయిన శ్రీకుమార్ ఆచారి అలియాస్ జగతి శ్రీకుమార్ నాలుగు దశాబ్దాల కెరీర్‌లో 1500కి పైగా మూవీస్‌లో కనిపించారు.

బ్రహ్మానందం
తెలుగు హాస్యనటుడు బ్రహ్మానందం తన కెరీర్ మొత్తంలో 1100కి పైగా మూవీస్ చేశారు. 1000కి చిత్రాల్లో కమెడియన్ గా చేసిన గిన్నిస్ రికార్డ్ కూడా సొంతం చేసుకున్నారు. కమెడియన్లలో అత్యధిక రెమ్యునరేషన్ అందుకున్న రికార్డ్ కూడా ఈయన పేరిట ఉంది.

శక్తి కపూర్
బాలీవుడ్‌కి చెందిన శక్తి కపూర్.. 1975 నుంచి ఇప్పటికీ నటిస్తూనే ఉన్నారు. రీసెంట్ టైంలో యానిమల్, ఎల్ 2 ఎంపురాన్ లాంటి పాన్ ఇండియా చిత్రాల్లో కనిపించారు. 1980-90 మధ్య కాలంలో 100కి పైగా సినిమాలు చేసిన ఈయన.. మొత్తంగా చూసుకుంటే ఇప్పటివరకు 700కిపైగా మూవీస్‌లో కనిపించారు. ఈయన కూతురు శ్రద్ధా కపూర్ ప్రస్తుతం హీరోయిన్‌గా చేస్తోంది.

అనుపమ్ ఖేర్
హిందీ నటుడు అనుపమ్ ఖేర్. 1982 నుంచి ఇప్పటికీ నటిస్తూనే ఉన్నారు. రీసెంట్ టైంలో పలు పాన్ ఇండియా చిత్రాల్లో కీలక పాత్రలు చేస్తున్నారు. నాలుగు దశాబ్దాల కెరీర్‌లో 540కి పైగా సినిమాల్లో కనిపించారు. నటుడిగానే కాకుండా దర్శకుడు, నిర్మాతగానూ పలు చిత్రాల్ని తెరకెక్కించడం విశేషం.

మమ్ముట్టి
మహమ్మద్ కుట్టి పనపరంబిల్ ఇస్మాయిల్ అలియాస్ మమ్ముట్టి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. 74 ఏళ్ల వయసులోనూ ఇప్పటికీ హీరోగా మూవీస్ చేస్తున్న ఈయన కెరీర్ మొత్తంలో 450కి పైగా చిత్రాల్లో కనిపించారు. ఇందులో 400కి పైగా సినిమాల్లో హీరోగా నటించడం విశేషం. ఈయన కొడుకు దుల్కర్ సల్మాన్ ప్రస్తుతం పాన్ ఇండియాలోని ప్రధాన భాషల్లో హీరోగా సినిమాలు చేస్తున్నాడు.

(ఇదీ చదవండి: ప్రభాస్ రీల్ మదర్.. ఒకప్పటి హీరోయిన్.. చాక్లెట్ ఫ్యాక్టరీ ఓనర్)

Advertisement
 
Advertisement
Advertisement