breaking news
Sukumari
-
ఎక్కువ సినిమాలు చేసింది ఎవరు? బ్రహ్మీ స్థానమెంత?
ఒకప్పటితో పోలిస్తే మన దేశానికి సంబంధించిన వివిధ భాషల సినిమాలు, నటీనటులు.. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంటున్నారు. అదే టైంలో యాక్టర్స్ ఎక్కువైపోవడం వల్ల కెరీర్ మొత్తంలో మహా అయితే పదుల సంఖ్యలో లేదంటే వందల్లో మాత్రమే మూవీస్ చేస్తున్నారు. కానీ కొందరు నటీనటులు మాత్రం వేల చిత్రాల్లో నటించి ఎవరికీ సాధ్యం కాని రికార్డ్ సృష్టించారు. ఇంతకీ ఎక్కువ చిత్రాల్లో కనిపించిన నటి/నటుడు ఎవరంటే?(ఇదీ చదవండి: ఓటీటీలో కోర్ట్ రూమ్ థ్రిల్లర్ సినిమా.. ట్రైలర్ రిలీజ్)సుకుమారిమలయాళ చిత్రసీమకు చెందిన ఈమె.. 1940లో పుట్టి 2013లో చనిపోయారు. దక్షిణాది భాషలతో పాటు హిందీ, సింహళ, ఫ్రెంచ్, ఇటాలియన్, బెంగాలీ, తుళు, ఇంగ్లీష్ భాషల్లో కలిపి మొత్తంగా 2500కి పైగా సినిమాల్లో కనిపించారు. ఈమెనే ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉంది.మనోరమగోపిశాంత అలియాస్ మనోరమ స్వతహాగా తమిళ నటి. 1500కి పైగా సినిమాల్లో కనిపించిన ఈమె 5000కి పైగా నాటకాల్లోనూ వివిధ పాత్రలు పోషించారు. అలానే అన్నాదురై, కరుణానిధి, జయలలిత, ఎమ్జీఆర్, స్టాలిన్, ఎన్టీఆర్, విజయ్ లాంటి ఏడుగురు ముఖ్యమంత్రులతో కలిసి నటించిన ఘనత ఈమె సొంతం.జగతి శ్రీకుమార్మలయాళ ఇండస్ట్రీకి చెందిన నటుడు, దర్శకుడు, సింగర్ అయిన శ్రీకుమార్ ఆచారి అలియాస్ జగతి శ్రీకుమార్ నాలుగు దశాబ్దాల కెరీర్లో 1500కి పైగా మూవీస్‌లో కనిపించారు.బ్రహ్మానందంతెలుగు హాస్యనటుడు బ్రహ్మానందం తన కెరీర్ మొత్తంలో 1100కి పైగా మూవీస్ చేశారు. 1000కి చిత్రాల్లో కమెడియన్ గా చేసిన గిన్నిస్ రికార్డ్ కూడా సొంతం చేసుకున్నారు. కమెడియన్లలో అత్యధిక రెమ్యునరేషన్ అందుకున్న రికార్డ్ కూడా ఈయన పేరిట ఉంది.శక్తి కపూర్బాలీవుడ్కి చెందిన శక్తి కపూర్.. 1975 నుంచి ఇప్పటికీ నటిస్తూనే ఉన్నారు. రీసెంట్ టైంలో యానిమల్, ఎల్ 2 ఎంపురాన్ లాంటి పాన్ ఇండియా చిత్రాల్లో కనిపించారు. 1980-90 మధ్య కాలంలో 100కి పైగా సినిమాలు చేసిన ఈయన.. మొత్తంగా చూసుకుంటే ఇప్పటివరకు 700కిపైగా మూవీస్‌లో కనిపించారు. ఈయన కూతురు శ్రద్ధా కపూర్ ప్రస్తుతం హీరోయిన్గా చేస్తోంది.అనుపమ్ ఖేర్హిందీ నటుడు అనుపమ్ ఖేర్. 1982 నుంచి ఇప్పటికీ నటిస్తూనే ఉన్నారు. రీసెంట్ టైంలో పలు పాన్ ఇండియా చిత్రాల్లో కీలక పాత్రలు చేస్తున్నారు. నాలుగు దశాబ్దాల కెరీర్లో 540కి పైగా సినిమాల్లో కనిపించారు. నటుడిగానే కాకుండా దర్శకుడు, నిర్మాతగానూ పలు చిత్రాల్ని తెరకెక్కించడం విశేషం.మమ్ముట్టిమహమ్మద్ కుట్టి పనపరంబిల్ ఇస్మాయిల్ అలియాస్ మమ్ముట్టి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. 74 ఏళ్ల వయసులోనూ ఇప్పటికీ హీరోగా మూవీస్ చేస్తున్న ఈయన కెరీర్ మొత్తంలో 450కి పైగా చిత్రాల్లో కనిపించారు. ఇందులో 400కి పైగా సినిమాల్లో హీరోగా నటించడం విశేషం. ఈయన కొడుకు దుల్కర్ సల్మాన్ ప్రస్తుతం పాన్ ఇండియాలోని ప్రధాన భాషల్లో హీరోగా సినిమాలు చేస్తున్నాడు.(ఇదీ చదవండి: ప్రభాస్ రీల్ మదర్.. ఒకప్పటి హీరోయిన్.. చాక్లెట్ ఫ్యాక్టరీ ఓనర్) -
మాస్ యాదగిరి
తిరువీర్, ఐశ్వర్యా రాజేశ్ హీరో హీరోయిన్లుగా పల్లెటూరి నేపథ్యంలో ‘ఓ.! సుకుమారి’ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో తిరువీర్ పోషిస్తున్న యాదగిరి పాత్ర లుక్‌ని సోమవారం రిలీజ్ చేశారు. భరత్ దర్శన్ దర్శకత్వంలో మహేశ్వర రెడ్డి మూలి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.‘‘మా బేనర్లో విమర్శకుల ప్రశంసలు పొందిన తొలి సినిమా ‘శివం భజే’ తర్వాత నిర్మిస్తున్న చిత్రం ‘ఓ.! సుకుమారి’. ఈ చిత్రంలో తిరువీర్ పల్లెటూరి యువకుడిలా మాస్ పాత్రలో కనిపిస్తారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమాని విడుదల చేస్తాం’’ అని నిర్మాత తెలిపారు. -
నమ్మ గ్రామానికి ‘అమ్మ’ అభినందన
తమిళ సినిమా, న్యూస్‌లైన్ : రెండు జాతీయ అవార్డులతోపాటు సీఎం జయలలిత అభినందనలను అందుకున్న చిత్రం నమ్మ గ్రామం. కుల మతాల జాఢ్యం, మహిళలపై జరుగుతున్న అకృత్యాలపై ఇంతకుముందు పలు చిత్రాలు వచ్చినా వాటికి భిన్నంగా యదార్థ సంఘటన ఆధారంగా రూపొందిన చిత్రం నమ్మ గ్రామం అని ఆ చిత్ర దర్శకుడు మోహన్‌శర్మ తెలిపారు. తమిళం, తెలుగు, మలయా ళం, కన్నడం భాషల్లో 17కు పైగా చిత్రాల్లో వివిధ తరహా పాత్రలు పోషించి గుర్తింపు పొందిన ఈయన నిర్మాతగా 17 చిత్రాలు నిర్మించారు. 2002లో దక్షిణ భారత సినీ వాణిజ్య మండలి అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించిన మోహన్‌శర్మ తొలిసారిగా దర్శకత్వం వహించిన చిత్రం నమ్మ గ్రామం. దర్శకుడు మాట్లాడుతూ సమాజానికి ఉపయోగపడే ఒక మంచి చిత్రాన్ని తెరకెక్కించాలని భావించానన్నారు. సుమారు 100 ఏళ్ల క్రితం జరిగిన ఒక యదార్థ సంఘటన ఆధారంగా నమ్మ గ్రామం చిత్రాన్ని రూపొందించినట్లు చెప్పారు. జాతి జాఢ్యం ఎంతగా పెరిగిపోయింది, దాని పరిణామాలేమిటి? అనే అంశాలను సహజసిద్ధంగా తెరకెక్కించినట్లు తెలిపారు. ఇందులో నిషాంత్, సమృతతోపాటు సుకుమారి, వై.జి.మహేంద్రన్, ఫాతిమాబాబు, నళిని నట్టించారని, తాను కూడా నటించినట్లు చెప్పారు. నమ్మ గ్రామం చిత్రంలో నటించిన సుకుమారి ఉత్తమ సహాయ నటిగాను, ఇందిరన్ జమున ఉత్తమ కాస్ట్యూమర్గాను, 2012లో జాతీయ అవార్డులను అందుకున్నారని, ముఖ్యమంత్రి జయలలిత చిత్రం చూసి చాలా మంచి చిత్రం అంటూ అభినందించారని దర్శకుడు తెలిపారు. గుణచిత్ర పతాకంపై రూపొందిన ఈ చిత్రాన్ని జనవరి 3న విడుదల చేయనున్నట్లు తెలిపారు.


