ఈ సినిమాలో పాటతో పాటు ఫైట్‌ కూడా చేశా: రాజేంద్రప్రసాద్‌ | Rajendra Prasad Talks About Panchali Pancha Bhartrika Movie | Sakshi
Sakshi News home page

‘పాంచాలి పంచభర్తృక ’లో అప్పటి రాజేంద్ర ప్రసాద్‌ని చూస్తారు

May 9 2026 11:33 AM | Updated on May 9 2026 12:15 PM

Rajendra Prasad Talks About Panchali Pancha Bhartrika Movie

కామెడీ సినిమాలకు ఎప్పటికి ఆదరణ ఉంటుంది . టైటిల్ లోనే వైవిధ్యం చూపిస్తూ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే కామెడీ కథాంశం తో విడుదలకు సిద్ధం అయిన చిత్రం ‘పాంచాలి పంచభర్తృక ’.  నట కిరీటి రాజేంద్రప్రసాద్ మెయిన్ లీడ్ లో నటిస్తున్న ఈ సినిమాకి   రాజ్ పవన్ , వెంకట్ దుగ్గిరెడ్డి యూఎస్ఏ నిర్మాతలుగా వ్యవహరించగా  గంగ సప్తశిఖర దర్శకత్వం వహించారు.  ఈ సినిమా లోని ’సెనోరిటా రాసిస్తా నా ఆస్తి నీ పేరిట ’ అనే రెట్రో స్టైల్ లో ఉన్న పాటను ఇటీవల  విడుదల చేశారు. ఈ పాట సోషల్ మీడియా లో ట్రెండింగ్ గా నిలిచి ప్రేక్షకులను అలరిస్తుంది . ఈ సందర్బంగా సినిమా యూనిట్ మీడియా తో పాంచాలి పంచభర్తృక సినిమా విశేషాలని పంచుకున్నారు .

రాజేంద్ర ప్రసాద్‌ మాట్లాడుతూ.. ‘ఈ మధ్య కాలం లో నాకు ఇలాంటి పాత్ర రావడం చాల అరుదు , ఈ సినిమాలో పాట , ఫైట్ లతో మళ్ళీ మీ అప్పటి  రాజేంద్రప్రసాద్ ని  చూస్తారు’ అన్నారు. 

దర్శకుడు గంగ సప్తశిఖర మాట్లాడుతూ..‘బాబీ అందించిన  బలమైన కథ చెప్పడానికి కామెడీ ని ఎంచుకున్నాను , రెండు గంటలు ప్రేక్షకులని నవ్వించడం పెద్ద టాస్క్ , టీం వర్క్ తో అది సాధ్యం అయింది , ప్రేక్షకులకి నచ్చే మెచ్చే సినిమా ఈ పాంచాలి పంచభర్తృక. ఈ సినిమాలో డైలాగ్స్ కచ్చితంగా ట్రెండ్ అవుతాయి  , ఈ సినిమా నిర్మాణం లో సహకరించిన నిర్మాతలకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను’ అన్నారు. 

ఈ సినిమాలో మొదటి సారి  హీరో పాత్రలో కనిపించబోతున్న రాప్ సెన్షేషన్  రోల్ రైడా మాట్లాడుతూ  ‘సినిమా మొత్తం నవ్వుతూనే చూస్తారు , ప్రేక్షకుడికి మంచి ఫన్ ట్రీట్ ఈ సినిమా ’ అని తెలిపారు .

‘ఆరోగ్యవంతమైన కామెడీ తెలుగు ప్రేక్షకులు చూసి చాల రోజులైంది , ఇంత మంచి కామెడీ రైటింగ్ రాయడం ఒక ఎత్తు అయితే ఆ టైమింగ్ లో నటించడం మాకు సవాలే ’అని మరో హీరోగా నటించిన జెమినీ సురేష్ అన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement