breaking news
Ganga Saptha Shikhara
-
‘పాంచాలి పంచభర్తృక’ మూవీ రివ్యూ
టైటిల్: పాంచాలి పంచభర్తృకనటీనటులు: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, కమెడియన్ పృధ్వీ, సరీహ్ ఫార్, రోల్ రైడా, రాజ్ పవన్, జెమిని సురేష్, వెంకట్ దుగ్గిరెడ్డి తదితరులుదర్శకుడు: గంగా సప్తశిఖరసంగీతం: మహేష్ నారాయణ, బ్షేక్నిర్మాతలు: వెంకట్ దుగ్గిరెడ్డి (అమెరికా), రాజ్ పవన్ఎడిటర్: జానీ బాషా నాగ‘పాంచాలి పంచభర్తృక’ టైటిల్ చాలా క్రేజీగా ఉండటం.. రాజేంద్రప్రసాద్, పృధ్వీరాజ్ వంటి భారీ తారాగణం నటించడంతో సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్ వంటివి సినిమాపై అంచనాలను పెంచేశాయి. ప్రస్తుతం సస్పెన్స్ థ్రిల్లర్ల హవా నడుస్తోంది. దీనికి కామెడీని కూడా జోడించడంతో సినిమా మరింత ఆసక్తికరంగా మారింది. మరి నేడు విడుదలైన ఈ సినిమా ఎలా ఉంది? అంచనాలను అందుకుందా? తెలుసుకుందాం.కథేంటంటే..డాక్టర్ దమయంతిని డాన్సన్ మనుషులు ఎత్తుకెళతారు. ఆమెను చంపేస్తామని బెదిరించి తమ బిజినెస్‌లో సహకరించేలా ఒప్పిస్తారు. మరోవైపు సీరియల్స్ తీసుకునే చిత్తరంజన్ (జెమిని సురేష్)కు సినిమా తీయాలని కోరిక. దాని కోసం యత్నిస్తూ ఉంటాడు. అద్దె ఇంటి కోసం కాట్రాజ్, పుష్పరాజ్ ఇద్దరూ వెదుకుతూ ఉంటారు. వారికి చిత్తరంజన్ తమ అపార్ట్మెంటులోని పెంట్ హౌస్‌లో తమతో పాటు ఉండాలని చెబుతాడు. అలా అద్దె షేర్ చేసుకుంటూ ఉంటారు. అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ బాబ్జీ ముగ్గురు ఉండటానికి అంగీకరించకపోతే అతడిని పొగిడి బుట్టలో వేసుకుంటారు. అలా నలుగురూ ఏకమవుతారు. ఒకరోజు ఒక అమ్మాయిని తెచ్చుకోవాలని ప్లాన్ చేసుకుంటారు. అలా సెనోరిటాని ఆన్లైన్లో బుక్ చేసుకుంటారు. ఆమె తన బాయ్‌ఫ్రెండ్ గురించి వాళ్లకు చెబుతుంది. ఆ తరువాత నలుగురూ ఓ పని మీద బయటకు వెళతారు. వెళ్లి వచ్చేసరికి సెనోరిటా రక్తపు మడుగులో పడి ఉంటుంది. ఆ శవాన్ని మాయం చేద్దామని సూట్‌కేసులో పెడితే చివరకు ఆ సూట్‌కేసు కూడా మాయమవుతుంది. అసలు శవంతో ఉన్న సూట్‌కేసు ఏమైంది? పరమసుందరి (రాజేంద్ర ప్రసాద్) ఎవరు? సినిమాలో రోజ్మేరి పాత్ర ఏమిటి? సీక్రెట్ ఏజెంట్ ఏడుకొండలు అలియాస్ ఎకో ఏం చేశాడు? వంటి అంశాలను సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.ఎలా ఉందంటే..సినిమాలో పాత్రల పరిచయానికి కమెడియన్ సునీల్ వాయిస్ ఓవర్ ఇవ్వడం ఆసక్తికరం. పాత్రల పరిచయమే చాలా వెరైటీగా అనిపిస్తుంది. ఇక పాత్రల పేర్లు సైతం మరింత ఆసక్తికరం. సినిమా విషయానికి వస్తే కథ, కథనం అన్నీ చాలా బాగున్నాయి. నలుగురు వ్యక్తులు కలిసి అమ్మాయిని తెచ్చుకోవడం.. ఆమెతో గడపాలని అనుకుంటుండగానే ఆమె మరణించడం.. ఆ తరువాత అసలు ఆమెను ఎవరు చంపేశారు? అనేది లాస్ట్ వరకూ గెస్ చేయడం ఏమాత్రం సాధ్యం కాదు. స్క్రీన్‌ప్లే అంత గ్రిప్పింగ్‌గా ఉంటుంది. ఫస్టాఫ్ అంతా పాత్రల పరిచయం, కామెడీ సన్నివేశాలు, మర్డర్‌తో నడిపిన దర్శకుడు.. సెకండాఫ్‌లో అసలు ఎవరు మర్డర్ చేశారు? అనేదే కాకుండా వరుసగా ఎక్కడా గందరగోళం లేకుండా చిక్కుముడులను విప్పిన తీరు ఆకట్టుకుంటుంది. ఇక చివరిలో రెండు ట్విస్ట్‌లు ఉంటాయి. అవి ఒకదానికి మించి మరొకటి ఉంటాయి. ఒక సస్పెన్స్, థ్రిల్లర్‌ను కామెడీతో జత చేసి నడిపిన తీరు ఆకట్టుకుంది. సినిమాలో అనవసరమనే పాత్ర ఏదీ లేదు. ప్రతి పాత్రకూ ప్రాధాన్యముంటుంది. ముఖ్యంగా రాజేంద్ర ప్రసాద్, పృధ్వీరాజ్ వంటి ప్రముఖ నటులు తమ కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకున్నారు.ఎవరెలా నటించారంటే..ముఖ్యంగా రాజేంద్ర ప్రసాద్, కమెడియన్ పృధ్వీలు తమ పాత్రలకు న్యాయం చేశారు. జెమినీ సురేష్‌కు మంచి ప్రాధాన్యమున్న పాత్ర దక్కింది. ఆయన కూడా దానిని చక్కగా వినియోగించుకున్నారు. రోల్ రైడాకు ఇంతకాలానికి సినిమాలో ఫుల్ లెంగ్త్ పాత్ర దక్కింది. ముఖ్యంగా చాలా మంది కొత్తవారికి ఈ సినిమా లైఫ్ ఇచ్చింది. సరీహ్ ఫార్, రోల్ రైడా, రాజ్ పవన్, జెమిని సురేష్, వెంకట్ దుగ్గిరెడ్డి తదితరులు తమ పాత్ర పరిధి మేరకు చక్కగా నటించారు. ఈ సినిమాలో ప్రొడ్యూసర్ రాజ్ పవన్ సైతం ఓ కీలక పాత్రలో నటించారు. కొత్తగా నటిస్తున్నప్పటికీ ఎక్కడా తడబడకుండా బాగా నటించారు.టెక్నికల్ పరంగా..దర్శకుడు గంగా సప్తశిఖర ఈ కథను ఫుల్ ఎంటర్టైనింగ్గా తెరపై చూపించడంలో సక్సెస్ అయ్యాడు. ప్రతి పాత్రకూ ప్రాధాన్యమిస్తూ.. ప్రతి పాత్రను ఆసక్తికరంగా తీర్చిదిద్దారు. సినిమాను ప్రెజెంట్ చేసిన తీరు ఎంతగానో ఆకట్టుకుంటుంది. సినిమా చూస్తున్నంత సేపు ఎంతో అనుభవమున్న దర్శకుడి మాదిరిగానే అనిపిస్తారు. పైగా ఆయన స్వయంగా ఈ చిత్రంలో ఓ పాత్రలో నటించి మెప్పించారు. సీక్రెట్ ఏజెంట్ ఏడుకొండలుగా నటించి నవ్వులు పూయించారు. మ్యూజిక్ విషయానికి వస్తే టైటిల్ సాంగ్ బాగుంది. మిగిలిన పాటలన్నీ ఓకే ఓకే. పవన్ నిర్మాతగానే కాకుండా ఎడిటింగ్, మ్యూజిక్ విషయంలోనూ దృష్టి సారించారు. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. -
ఈ సినిమాలో పాటతో పాటు ఫైట్ కూడా చేశా: రాజేంద్రప్రసాద్
కామెడీ సినిమాలకు ఎప్పటికి ఆదరణ ఉంటుంది . టైటిల్ లోనే వైవిధ్యం చూపిస్తూ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే కామెడీ కథాంశం తో విడుదలకు సిద్ధం అయిన చిత్రం ‘పాంచాలి పంచభర్తృక ’. నట కిరీటి రాజేంద్రప్రసాద్ మెయిన్ లీడ్ లో నటిస్తున్న ఈ సినిమాకి రాజ్ పవన్ , వెంకట్ దుగ్గిరెడ్డి యూఎస్ఏ నిర్మాతలుగా వ్యవహరించగా గంగ సప్తశిఖర దర్శకత్వం వహించారు. ఈ సినిమా లోని ’సెనోరిటా రాసిస్తా నా ఆస్తి నీ పేరిట ’ అనే రెట్రో స్టైల్ లో ఉన్న పాటను ఇటీవల విడుదల చేశారు. ఈ పాట సోషల్ మీడియా లో ట్రెండింగ్ గా నిలిచి ప్రేక్షకులను అలరిస్తుంది . ఈ సందర్బంగా సినిమా యూనిట్ మీడియా తో పాంచాలి పంచభర్తృక సినిమా విశేషాలని పంచుకున్నారు .రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. ‘ఈ మధ్య కాలం లో నాకు ఇలాంటి పాత్ర రావడం చాల అరుదు , ఈ సినిమాలో పాట , ఫైట్ లతో మళ్ళీ మీ అప్పటి రాజేంద్రప్రసాద్ ని చూస్తారు’ అన్నారు. దర్శకుడు గంగ సప్తశిఖర మాట్లాడుతూ..‘బాబీ అందించిన బలమైన కథ చెప్పడానికి కామెడీ ని ఎంచుకున్నాను , రెండు గంటలు ప్రేక్షకులని నవ్వించడం పెద్ద టాస్క్ , టీం వర్క్ తో అది సాధ్యం అయింది , ప్రేక్షకులకి నచ్చే మెచ్చే సినిమా ఈ పాంచాలి పంచభర్తృక. ఈ సినిమాలో డైలాగ్స్ కచ్చితంగా ట్రెండ్ అవుతాయి , ఈ సినిమా నిర్మాణం లో సహకరించిన నిర్మాతలకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను’ అన్నారు. ఈ సినిమాలో మొదటి సారి హీరో పాత్రలో కనిపించబోతున్న రాప్ సెన్షేషన్ రోల్ రైడా మాట్లాడుతూ ‘సినిమా మొత్తం నవ్వుతూనే చూస్తారు , ప్రేక్షకుడికి మంచి ఫన్ ట్రీట్ ఈ సినిమా ’ అని తెలిపారు .‘ఆరోగ్యవంతమైన కామెడీ తెలుగు ప్రేక్షకులు చూసి చాల రోజులైంది , ఇంత మంచి కామెడీ రైటింగ్ రాయడం ఒక ఎత్తు అయితే ఆ టైమింగ్ లో నటించడం మాకు సవాలే ’అని మరో హీరోగా నటించిన జెమినీ సురేష్ అన్నారు. -
తొలి సినిమానే ప్రయోగం..యంగ్ డైరెక్టర్ సాహసం!
సాధారణంగా తొలి సినిమా అంటే సేఫ్ జోన్లో ఉండేందుకు ట్రెండింగ్ సబ్జెక్ట్‌ను ఎంచుకొని పాత పద్దతినే ఫాలో అవుతారు నూతన దర్శకులు. కానీ కొద్ది మంది మాత్రమే తొలి సినిమాతోనే ప్రయోగం చేస్తారు. ఆ లిస్ట్‌లోకి యంగ్ డైరెక్టర్ గంగ సప్తశిఖర(Ganga Saptha Shikhara ) కూడా వస్తాడు. ఆయన దర్శకత్వం వహించిన తొలి సినిమా ‘ది డెవిల్స్ చైర్’(The Devil's Chair). జబర్దస్త్ ద్వారా జనాల్లోకి వెళ్లిన అదిరే అభి హీరోగా నటిస్తున్నాడు. ఈ హారర్ సినిమా కోసం అప్డేటెడ్ ఏ ఐ టెక్నాలజీ ఉపయోగించాడట డైరెక్టర్. కాన్సెప్ట్‌తో పాటు మేకింగ్ కూడా డిఫరెంట్‌గా ఉండబోతుందట. గతంలో ఆయన తెరకెక్కించిన షార్ట్ ఫిలిమ్స్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు పలు అవార్డులను తెచ్చిపెట్టాయి. లిమిటెడ్ బడ్జెట్లో డిఫరెంట్ కాన్సెప్ట్ ఓరియెంటెడ్ ఫిలిమ్స్ తియ్యగల సత్తా ఉన్న దర్శకుడిగా గుర్తింపు పొందాడు. ‘ది డెవిల్స్ చైర్’ని కూడా అదే తరహాలో డిఫరెంట్‌గా తీర్చిదిద్దినట్లు ప్రచార చిత్రాలు చూస్తే అర్థమవుతుంది.హీరోగా నటించిన అభి కూడా దర్శకుడి ప్రతిభపై ప్రశంసలు కురిపించాడు.‘ది డెవిల్స్ చైర్ అనే టైటిల్ అన్ని భాషలకు యాప్ట్‌గా ఉంటుంది. మనిషికి ఉండే దురాశ మీదే ఈ చిత్రాన్ని తీశాం. మంచి కాన్సెప్ట్‌తో పాటు మంచి సందేశం ఇచ్చేలా దర్శకుడు గంగ సప్తశిఖర ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాడు. ఈ చిత్రం అందరినీ భయపెట్టేలా ఉంటుంది’ అని అన్నారు.‘ది డెవిల్స్ చైర్’చూసిన ప్రతీ ఒక్కరినీ హంట్ చేస్తుంది. డెవిల్ మీ ఇంటికి వస్తుంది. మంచి కంటెంట్‌తో ఈ చిత్రం రాబోతోంది. కావాల్సినంత డ్రామా, వినోదం ఉంటుంది’ అని దర్శకుడు గంగ సప్త శిఖర అన్నారు. ఫిబ్రవరి 21న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రంతో పాటు W/O అనిర్వేష్ చిత్రానికి కూడా గంగ సప్తశిఖర దర్శకత్వం వహించారు. జబర్దస్త్ రాంప్రసాద్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది.


