మేం అమ్మనాన్న అయ్యాం.. కమెడియన్ పోస్ట్ | Comedian Kevvu Karthik Wife Blessed With Baby | Sakshi
Sakshi News home page

Kevvu Karthik Baby: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన కమెడియన్ భార్య

May 17 2026 2:31 PM | Updated on May 17 2026 3:10 PM

Comedian Kevvu Karthik Wife Blessed With Baby

జబర్దస్త్ కామెడీ షోతో చాలామంది కమెడియన్లు గుర్తింపు తెచ్చుకున్నారు. వాళ్లలో కెవ్వు కార్తిక్ ఒకడు. ప్రారంభంలో అవినాష్‌తో కలిసి స్కిట్స్ చేసిన ఇతడు తర్వాత టీమ్ లీడర్ అయ్యాడు. ప్రస్తుతం ప్రవీణ్‌తో కలిసి షోలో కనిపిస్తున్నాడు. ఇకపోతే రెండేళ్ల క్రితం సిరి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు ఆమె బిడ్డకు జన్మనిచ్చినట్లు కార్తీక్ వెల్లడించాడు.

(ఇదీ చదవండి: అట్లీ పాపకు అందమైన పేరు.. దాని అర్థమేంటంటే?)

మేం అమ్మనాన్న అయ్యాం. చిన్ని పాదాలతో మా జీవితాల్లోకి వచ్చిన బిడ్డ మా జీవితాలని మార్చేసింది. అమ్మని కోల్పోయిన సరిగ్గా రెండేళ్లకు ఈ బిడ్డ మా జీవితాల్లోకి వచ్చింది అని కెవ్వు కార్తిక్ చెప్పుకొచ్చాడు. ఇందుకు సంబంధించిన మూడు ఫొటోలని సోషల్ మీడియాలో పంచుకున్నాడు.

కార్తిక్‌తో స్కిట్స్ చేసిన అవినాష్ కూడా రెండు మూడు రోజుల క్రితమే తండ్రయిన విషయాన్ని బయటపెట్టాడు. కొడుకు పుట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా పిల్లాడి ఫొటోలని పంచుకున్నడు. మరోవైపు కార్తిక్‌తో ప్రస్తుతం స్కిట్స్ చేస్తున్న ప్రవీణ్.. రీసెంట్‌గానే నటి వంశీతని పెళ్లి చేసుకున్నాడు.

(ఇదీ చదవండి: 'ప్రేమలు' హీరో పగబడితే.. ఓటీటీ తెలుగు రివ్యూ)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement