breaking news
Kevvu Kartheek
-
భార్యతో ద్వారకా తిరుమల వెళ్లిన కమెడియన్ (ఫోటోలు)
-
కెవ్వు కార్తీక్ ఇంట విషాదం.. 'నువ్వు లేకుండా ఎలా బతకాలమ్మా..'
జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్ ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కార్తీక్ తల్లి క్యాన్సర్తో పోరాడుతూ కన్నుమూసింది. ఈ విషాద వార్తను కమెడియన్ గురువారం సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తూ ఎమోషనలయ్యాడు. 'అమ్మా.. గత ఐదు సంవత్సరాల 2 నెలలుగా క్యాన్సరే భయపడే విధంగా దానిపై అలుపెరగని పోరాటం చేశావు. నీ జీవితమంతా యుద్ధమే! కంటికి రెప్పలామమ్మల్ని కన్నావు.. నాన్నకు తోడుగా కుటుంబాన్ని కష్టపరిస్థితుల్లో కూడా కంటికి రెప్పలా కాపాడావు. ఈ ఐదు సంవత్సరాల నుంచి ఎలా ఒంటరిగా పోరాడాలని నేర్పావు. నీ ఆత్మస్థైర్యం నాలో ధైర్యాన్ని నింపింది. అన్నీ నేర్పావు కానీ, నువ్వు లేకుండా ఎలా బతకాలో నేర్పలేదు.. ఎందుకమ్మా..? వారికి పాదాభివందనాలుమా అమ్మ కోసం ప్రార్థించిన అందరికీ నా కృతజ్ఞతలు. అలాగే తనకు చికిత్స అందించిన వైద్యులకు నా పాదాభివందనాలు' అని ఇన్స్టాగ్రామ్లో తన తల్లి ఫోటోను షేర్ చేశాడు. ఇది చూసిన బుల్లితెర సెలబ్రిటీలు, అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఆమె పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Kevvu Kartheek (@kevvukartheek) -
జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్ ఇల్లు చూశారా? ఎంత బాగుందో!
ఒక్కొక్కరిదీ ఒక్కో అభిరుచి.. కొందరికి రాయడం ఇష్టం.. కొందరికేమో పాడటం ఇష్టం.. పెయింటింగ్స్ వేయడం.. డ్యాన్స్ చేయడం, నటించడం.. ఇలా ఒక్కొక్కరికీ ఒక్కోటి నచ్చుతుంది. చాలామంది దాన్ని టైంపాస్గా భావిస్తారు. కానీ కళాకారులు మాత్రం వాటినే నమ్ముకుని అంచెలంచెలుగా ఎదుగుతుంటారు. అలా హాస్యాన్ని నమ్ముకుని, అందరినీ నవ్వించడమే పనిగా పెట్టుకున్నవాళ్లు ఎంతోమంది ఇండస్ట్రీలో వెలుగు వెలుగుతున్నారు. వారిలో ఒకరే జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్. తన పంచులతో, స్కిట్లతో ప్రేక్షకులకు వినోదాన్ని పంచే కెవ్వు కార్తీక్ ఇటీవలే వైవాహిక బంధంలోకి అడుగుపెట్టాడు. ఏడాది క్రితం కొత్త ఇల్లు కొనుక్కున్న కార్తీక్ తాజాగా హోం టూర్ వీడియో చేశాడు. తన ఇంటి గేటు దగ్గరి నుంచి ప్రతీది ప్రత్యేకంగా డిజైన్ చేయించినట్లు తెలిపాడు. 'గతంలో అద్దె ఇంట్లో ఉన్నప్పుడు హోంటూర్ చేశాను. నేను సొంతంగా ఓ ఇల్లు కొనుకున్నాక మళ్లీ హోంటూర్ వీడియో చేయాలనుకున్నాను. ఏడాది క్రితమే ఈ ఇల్లు కొన్నప్పటికీ ఇంటీరియర్, వస్తువులు అన్నీ సమకూర్చుకునేసరికి ఇంత సమయం పట్టింది. ఇన్నాళ్లకు ఇల్లు పూర్తిగా రెడీ అవడంతో వీడియో చేశాను. గతంలో నేను కింద పడుకునేవాడిని. సోఫా కూడా ఉండేది కాదు. నాకంటూ సొంతిల్లు ఉన్నాకే అవన్నీ కొనుక్కోవాలనుకున్నాను. ఇప్పుడు అన్నీ మంచి క్వాలిటీతో ఉన్నవి కొనుక్కున్నాను' అంటూ ప్రతి గదిని క్షుణ్ణంగా చూపించాడు కార్తీక్. హాల్, పూజ గది, డైనింగ్ టేబుల్, కిచెన్, మూడు బెడ్రూమ్స్, బాల్కనీ అన్నింటినీ తనకు నచ్చినట్లుగా ఆర్గనైజ్ చేయించుకున్నాడు. తన అవార్డులు, గృహప్రవేశానికి వచ్చిన బహుమతులను సైతం చూపిస్తూ పోయాడు. తన బాల్కనీని మొత్తం గ్రీనరీతో నింపేశాడు. ఈ ఇంట్లో నెమళ్ల శబ్ధాలు కూడా వినిపిస్తుండటం విశేషం. కాంక్రీట్ జంగిల్లో కాకుండా కాస్త ప్రశాంత వాతావరణం ఉన్న ప్రదేశంలో కార్తీక్ తన ఇంటిని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అభిమానులు సైతం ఇల్లు చాలా బాగుందంటూ కామెంట్లు చేస్తున్నారు. చదవండి: రాజకీయాల్లోకి ఎంట్రీ.. ఎమ్మెల్యేగా పోటీ? స్పందించిన రాహుల్