అట్లీ పాపకు అందమైన పేరు.. దాని అర్థమేంటంటే? | Director Atlee Announce His Daughter Name | Sakshi
Sakshi News home page

పాప పేరు ప్రకటించిన అట్లీ దంపతులు

May 17 2026 1:11 PM | Updated on May 17 2026 1:21 PM

Director Atlee Announce His Daughter Name

తమిళ స్టార్‌ డైరెక్టర్‌ అట్లీ ఈ ఏడాది ప్రారంభంలో గుడ్‌న్యూస్‌ చెప్పాడు. భార్య ప్రియ రెండోసారి గర్భం దాల్చిందని వెల్లడించాడు. కుమారుడు మీర్‌తో ఆడుకునేందుకు ఓ బుజ్జి బేబీ ఇంట్లోకి రాబోతుందని శుభవార్త చెప్పాడు. అంతలోనే ఏప్రిల్‌ 20న పాప పుట్టిందని ప్రకటించాడు. తాజాగా పాప పేరును వెల్లడించాడు.

కూతురి నామకరణం
మీర్‌, ప్రియ.. ఇద్దరి పేర్లలోని అక్షరాలు కలిసి వచ్చేలా మియూ (MIYOU) అని నామకరణం చేశాడు. మియూ అంటే అందం, ప్రేమకు చిరునామా అని తెలిపాడు. అలాగే మి అంటే నేను, యు అంటే నువ్వు.. అని అర్థం వచ్చేలా మియూ అని పేరు పెట్టినట్లు తెలుస్తోంది. మొత్తానికి మరోసారి అభిమానులు అట్లీ జంటకు కంగ్రాట్స్‌ చెప్తూ పాప పేరు భలే ఉందని కామెంట్లు చేస్తున్నారు.

టాప్‌ డైరెక్టర్‌గా..
అట్లీ విషయానికి వస్తే.. రాజా రాణి సినిమాతో దర్శకుడిగా ఫేమస్‌ అయ్యాడు. విజయ్‌కు తేరి, మెర్సల్‌, బిగిల్‌ చిత్రాలతో సూపర్‌ హిట్లు అందించాడు. షారూఖ్‌ ఖాన్‌కు జవాన్‌తో బ్లాక్‌బస్టర్‌ హిట్‌ ఇచ్చాడు. ప్రస్తుతం అల్లు అర్జున్‌తో రాకా మూవీ చేస్తున్నాడు. సన్‌ పిక్చర్స్‌ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ఈ భారీ బడ్జెట్‌ మూవీ వచ్చే ఏడాది విడుదల కానుంది. ఇటీవల రిలీజ్‌ చేసిన ఫస్ట్‌ లుక్‌తో అంచనాలు తారా స్థాయికి చేరుకున్నాయి.

 

చదవండి: చేయి కోసుకుని బ్లాక్‌మెయిల్‌ చేసింది నువ్వు కాదా? ఆర్తి రవి తల్లి ఫైర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement