కరుప్పు మూవీ.. పూనకంతో ఊగిపోయిన డైరెక్టర్..! | Kollywood Star Hero Suriya's Karuppu Movie Director Video Goes Viral | Sakshi
Sakshi News home page

Karuppu Movie: కరుప్పు మూవీ.. నాని జెర్సీ సీన్ రీ క్రియేట్..!

May 15 2026 4:48 PM | Updated on May 15 2026 4:55 PM

Kollywood Star Hero Suriya's Karuppu Movie Director Video Goes Viral

సూర్య హీరోగా వచ్చిన కరుప్పు ఎట్టకేలకు ఇవాళ థియేటర్లలో విడుదలైంది. వీరభద్రుడు పేరుతో ఈ మూవీని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. గురువారం రిలీజ్ కావాల్సిన ఈ సినిమా.. ఆర్థికపరమైన సమస్యలతో ఓ రోజు ఆలస్యంగా తెరపైకొచ్చింది. ఈ మూవీకి ఆర్‌జే బాలాజీ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో సూర్య సరసన హీరోయిన్‌గా త్రిష కనిపించింది.

ఇవాళ ‍మూవీ థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ ఆర్జే బాలాజీ సైతం థియేటర్‌లో వీక్షించారు. దీంతో సినిమాను చూసి పూనకంతో ఊగిపోయారు. టాలీవుడ్ హీరో నాని నటించిన జెర్సీ మూవీ సీన్ రీ క్రియేట్ చేశారు. ట్రైన్‌ సీన్‌లో నానిలానే బిగ్గరగా అరుస్తూ కనిపించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 
 

 

Advertisement
 
Advertisement
Advertisement