'తప్పు నాదే.. ఇప్పటికీ ఆ సినిమా చూడలేదు'.. లయ షాకింగ్ కామెంట్స్ | Tollywood Actress Laya Revealed Shocking Truth About Her Old Movie Maa Balaji, Says I Still Haven't Watched That Film | Sakshi
Sakshi News home page

Laya: 'ఎలా చేశానో.. ఎందుకు చేశానో తెలీదు.. ఇప్పటికీ సినిమా చూడలేదు'

May 12 2026 2:55 PM | Updated on May 12 2026 5:41 PM

Tollywood actress laya Revealed Shocking Truth about Her Old Movie

హీరోయిన్ లయ గురించి తెలుగువారికి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గతేడాది నితిన్ తమ్ముడు మూవీతో టాలీవుడ్‌లో రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ పెద్దగా సక్సెస్ కాకపోయినప్పటికీ ఆ తర్వాత మరో సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. హిట్ పెయిర్ అయిన శివాజీ సరసన సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని చిత్రంలో మెరిసింది. ప్రస్తుతం టాలీవుడ్‌లో మంచి పాత్రలు వస్తే చేయడానికి రెడీ అంటోంది.

అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఈ ముద్దుగుమ్మ.. తన కెరీర్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. అప్పట్లో తాను ఓ సినిమా చేసినందుకు చాలా బాధపడ్డానని తెలిపింది. ‍స్వయంవరం తర్వాత వడ్డే నవీన్ సరసన మా బాలాజీ అనే మూవీలో విడో పాత్రలో కనిపించానని వివరించింది. అయితే ఆ సినిమా కథ  రెమ్యునరేషన్‌ గురించి తాను అడగలేదని తెలిపింది. అయితే ఇలాంటి తప్పులు చేయకూడదని తర్వాత అనిపించిందని అభిప్రాయం వ్యక్తం చేసింది. కేవలం కోడి రామకృష్ణ గారిపై ఉన్న గౌరవంతో కథ వినకుండానే చేశానని తెలిపింది. ఆ సినిమాను ఇప్పటి వరకు తాను చూడలేదని లయ షాకింగ్ కామెంట్స్ చేశారు. విడో పాత్రలో నన్ను నేను చూసుకోలేకపోయానని తెలిపారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. 
 
 

Advertisement
 
Advertisement
Advertisement