'ఈ విషయంలో నాకు చాలా బాధగా ఉంది'.. నటికి డైరెక్టర్ కౌంటర్ | Tollywood actress Sunaina Badam aggressive on Happy journey first look poster | Sakshi
Sakshi News home page

Sunaina Badam: 'నేను లేకపోవడం చాలా బాధగా ఉంది'.. నటికి డైరెక్టర్ కౌంటర్

May 17 2026 1:50 PM | Updated on May 17 2026 2:02 PM

Tollywood actress Sunaina Badam aggressive on Happy journey first look poster

టాలీవుడ్ నటి సునయన షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇటీవల రిలీజ్ చేసిన హ్యాపీ జర్నీ మూవీ పోస్టర్‌లో తాను లేకపోవడం తీవ్రంగా బాధించిందని తెలిపింది. ఫస్ట్ లుక్ పోస్టర్‌లో నేను లేకపోవడంతో నా ఫ్యామిలీ కూడా ఫుల్ డిసప్పాయింట్‌కు గురయ్యారని వెల్లడించింది. విదేశాల్లో షూట్‌కు వెళ్లినప్పుడు కాస్తా గ్యాప్‌ దొరికితే ఎవరైనా షాపింగ్ వెళ్తారని చెప్పింది. అంతమాత్రాన నా ఫోటోను ఫస్ట్ లుక్ పోస్టర్‌లో నుంచి తీసేయండి చాలా బాధగా ఉందని తన ఆవేదన వ్యక్తం చేసింది.

షాపింగ్ వెళ్తే ఎలా ఉంటారు.. డైరెక్టర్ కౌంటర్

సునయనకు హ్యాపీ జర్నీ డైరెక్టర్ అభిరామ్ కౌంటరిచ్చారు. పారిస్ లాంటి లోకేషన్స్‌కు వెళ్లినప్పుడు.. షూట్‌లో లేకుండా మీరు షాపింగ్‌కు ఎలా వెళ్తారండి అని ప్రశ్నించారు. పారిస్‌ వరకు వచ్చాక మీరు షూటింగ్‌ లోకేషన్‌లో అందుబాటులో ఉండాలి కదా అని నిలదీశారు. అక్కడేక్కడో మిక్చర్ బాగుంటుంది.. ఇక్కడెక్కడో బజ్జీలు బాగుంటాయంటా? అని మీరు వెళ్తే మరి ఫోటోలో ఎలా కనిపిస్తారని ఎద్దేవా చేశారు. చివరికీ మిమ్మల్ని యాడ్ చేసేందుకు వీఎఫ్‌ఎక్స్‌లో కూడా ట్రై చేశామన్నారు. కానీ నేచురల్ లుక్ రాకపోవడంతోనే నేనే వద్దని చెప్పానని డైరెక్టర్ అభిరామ్ ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. ఇది మీ బ్యాడ్ లక్ అండి.. ఈ విషయంలో నేను ఎలాంటి సాయం చేయలేనని కౌంటరిచ్చారు. ఇప్పుడు ఈ మ్యాటర్ కాస్తా నెట్టింట వైరల్‌గా మారింది. కాగా.. సునయన బదం పలు సూపర్ హిట్ సినిమాల్లో క్యారెక్టర్‌గా ఆర్టిస్ట్‌గా మెప్పించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement