'అందుకే జనాలు థియేటర్లకు రావడం లేదు'.. రాహుల్ రామకృష్ణ షాకింగ్ కామెంట్స్ | Tollywood actor Rahul Ramakrishna Shicking Comments about movies | Sakshi
Sakshi News home page

Rahul Ramakrishna: 'టాలీవుడ్‌ను చూస్తుంటే బాధేస్తోంది'.. రాహుల్ ఆవేదన

May 12 2026 6:42 PM | Updated on May 12 2026 7:31 PM

Tollywood actor Rahul Ramakrishna Shicking Comments about movies

టాలీవుడ్ నటుడు రామకృష్ణ మనందరికీ సుపరిచితమైన పేరు. జాతిరత్నాలు మూవీలో తన నటన, డైలాగ్స్‌తో అందరినీ నవ్వించేశాడు. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించి టాలీవుడ్‌లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. పలు సినిమాల్లో కమెడియన్‌గా మెప్పించారు. అయితే తాజాగా రాహుల్ రామకృష్ణ తెలుగు సినీ ఇండస్ట్రీపై షాకింగ్ కామెంట్స్ చేశారు. కంటెంట్‌పైనే ఎక్కువగా దృష్టి పెట్టాలని సూచించారు. 

జనాలు థియేటర్లకు రావాలంటే ఖర్చులు విపరీతంగా పెరిగిపోయానని తెలిపారు. సినిమా టికెట్ కంటే ఎక్కువగా పార్కింగ్, పాప్‌కార్న్, పెట్రోల్ ఖర్చుల వల్ల ఇబ్బందులు పడుతున్నారని వెల్లడించారు. ఇవన్నీ దాటుకుని ప్రేక్షకులు థియేటర్లకు రావాలంటే సినిమాలు  గొప్పగా ఉండాలని  అన్నారు. బలహీనమైన కంటెంట్ కారణంగానే థియేటర్లు ఖాళీగా కనిపిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా రాహుల్ రామకృష్ణ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

రాహుల్ రామకృష్ణ మాట్లాడుతూ.. 'థియేటర్లు ఖాళీగా ఉండటం చాలా బాధాకరరం. ఇది మన సినిమాలకు ప్రేక్షకులు ఇస్తున్న నిజమైన తీర్పు. మనం తీస్తున్న సినిమాల స్థాయి ఎలా ఉందో పరిస్థితికి అద్దం పడుతోంది. ఈ రోజుల్లో ప్రేక్షకుడు థియేటర్‌కి రావడం అంత ఈజీ కాదు. బయటకు రావాలంటే ముందుగా ట్రాఫిక్ ఇబ్బందులు, పెరుగుతున్న పెట్రోల్ ఖర్చులు, పార్కింగ్ ఛార్జీలు, థియేటర్లలో స్నాక్స్ రేట్లు వంటి చాలా విషయాలు ప్రేక్షకుడిని ప్రభావితం చేస్తున్నాయని' అన్నారు.

ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రేక్షకులు థియేటర్‌కి రావాలంటే కథలో కొత్తదనం ఉండాలని రాహుల్ అన్నారు. కథలో ఏదైనా ప్రత్యేకత ఉంటే తప్ప జనాలు వచ్చే పరిస్థితి లేదని తెలిపారు. ప్రస్తుతం ఓటీటీల్లోనే చూసేందుకు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారని అభిప్రాయం వ్యక్తం చేశారు. రోటీన్ కథలకు కాలం చెల్లిందని.. కథలో కొత్తదనం, ఎమోషన్స్ ఉంటేనే ఆడియన్స్‌ ఆసక్తి చూపుతున్నారని వెల్లడించారు. ఈ కామెంట్స్ టాలీవుడ్‌ సినిమా పరిస్థితికి అద్దం పడుతున్నాయి. ఇకనైనా టాలీవుడ్ కంటెంట్‌పై దృష్టి పెడితే బాగుంటుందని సగటు అభిమాని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement