బోల్డ్‌ హారర్‌లో... | Aayush Sharma joins Ragini 3 opposite Tamannaah Bhatia | Sakshi
Sakshi News home page

బోల్డ్‌ హారర్‌లో...

May 11 2026 12:41 AM | Updated on May 11 2026 12:41 AM

Aayush Sharma joins Ragini 3 opposite Tamannaah Bhatia

ఇప్పటివరకూ ఏ సినిమాలోనూ కనిపించనంత బోల్డ్‌గా తమన్నా కనిపిస్తారని ఆమె కమిట్‌ అయిన తాజా చిత్రం స్పష్టం చేస్తోంది. ఇంతకీ అది ఏ సినిమా అంటే... బాలీవుడ్‌లో బోల్డ్‌ హారర్‌ మూవీగా పాపులర్‌ అయిన ‘రాగిణి ఎంఎంఎస్‌’లోని మూడో భాగం. ఏక్తా కపూర్‌ నిర్మించిన ‘రాగిణి ఎంఎంఎస్‌’, ఆ చిత్రం సీక్వెల్‌ ‘రాగిణి ఎంఎంఎస్‌ 2’ ఘనవిజయాన్ని సొంతం చేసుకున్నాయి.

తొలి భాగంలో కైనాజ్‌ మోతీవాలా, రెండో భాగంలో సన్నీ లియోన్‌ లీడ్‌ రోల్స్‌ చేశారు. మూడో భాగంలో తమన్నా నటించనున్నారు. ఈ పాత్ర చాలా గ్లామరస్‌గా ఉంటుంది. అలాగే ఈ సూపర్‌ నేచురల్‌ హారర్‌ థ్రిల్లర్‌లో రొమాన్స్‌ మోతాదు కూడా ఎక్కువగానే ఉన్న విషయం రెండు భాగాలు చూసినవాళ్లకు తెలిసే ఉంటుంది. మూడో భాగంలో కూడా అలానే ఉంటుందని, మోడ్రన్‌ అమ్మాయిగా, ఆత్మగా తమన్నా రెండు షేడ్స్‌ ఉన్న పాత్రలో కనిపిస్తారని ప్రచారం జరుగుతోంది.

ఈ చిత్రంలో ఆయుష్‌ శర్మ సరసన ఆమె నటిస్తారు. తమన్నాకన్నా ఆయుష్‌ ఏడాది చిన్న. ఇంకా ఆమిర్‌ ఖాన్‌ తనయుడు జునైద్‌ ఓ కీలక పాత్రలో కనిపిస్తారట. శశాంక్‌ ఘోష్‌ దర్శకత్వంలో ఏక్తా కపూర్‌ నిర్మించనున్న ఈ చిత్రం షూటింగ్‌ త్వరలో ఆరంభం కానుంది.

Advertisement
 
Advertisement
Advertisement