వివాదంలో రాజీవ్ కనకాల.. అసలేం జరిగిందంటే? | Tollywood Actor Rajeev Kanakala Clarity On His School Event | Sakshi
Sakshi News home page

Rajeev Kanakala: వివాదంలో రాజీవ్ కనకాల.. అసలేం జరిగిందంటే?

May 15 2026 2:32 PM | Updated on May 15 2026 2:42 PM

Tollywood Actor Rajeev Kanakala Clarity On His School Event

టాలీవుడ్ యాంకర్ సుమ భర్త రాజీవ్ కనకాల ఊహించని విధంగా వివాదంలో చిక్కుకున్నారు. ఓ స్కూల్‌ ఫంక్షన్‌కు హాజరైన ఆయన పదిలో ‍అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు మెమొంటోలు, షీల్డ్స్‌ అందజేశారు. అయితే ఈ ఈవెంట్‌కు నవ తెలంగాణ విద్యార్థి విభాగం సభ్యులు వచ్చిన ఒక్కసారిగా నిరసనకు దిగారు. అసలు ఈ పాఠశాలకు ప్రభుత్వ గుర్తింపు ఉందా అని నిలదీశారు.  అక్కడ స్కూల్ మేనేజ్‌మెంట్, విద్యార్థి సంఘం మధ్య గట్టిగానే వాగ్వాదం జరిగింది.

అదే సమయంలో పాఠశాలకు ముఖ్య అతిథిగా వచ్చిన రాజీవ్ కనకాలను సైతం ప్రశ్నించారు. నుమతులు లేని అలాంటి స్కూల్ ఫంక్షన్‌కి ఎలా అటెండ్ అవుతారని అడిగారు. అయితే ఈ విషయాల గురించి తనకు ఏమీ తెలియదని రాజీవ్ కనకాల అన్నారు. మంచి కార్యక్రమం అని పిలిస్తే వచ్చానని తెలిపారు. దయచేసి ఈ ఈవెంట్‌కు సంబంధించిన నా ఫోటోలు, వీడియోలు ఎవరూ కూడా పబ్లిసిటీ వినియోగించవద్దని రాజీవ్ కనకాల విజ్ఞప్తి చేశారు. నన్ను అలర్ట్‌ చేసినందుకు నవ తెలంగాణ విద్యార్థి విభాగానికిని నా ధన్యవాదాలు అంటూ వీడియో రిలీజ్ చేశారు. 
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement