నిబంధనలన్నీ హీరోయిన్లకే! | Kriti Sanon talks about Cocktail 2 | Sakshi
Sakshi News home page

నిబంధనలన్నీ హీరోయిన్లకే!

May 11 2026 12:50 AM | Updated on May 11 2026 12:50 AM

Kriti Sanon talks about Cocktail 2

‘‘బాలీవుడ్‌లో వివక్ష ఎక్కువ. ఒక సినిమా బడ్జెట్‌ తగ్గించాలంటే ముందు హీరోయిన్ల పారితోషికం తగ్గిస్తారు. అలాగే లొకేషన్‌కి హీరో రాక ముందే హీరోయిన్‌ మేకప్‌ వేసుకుని రెడీగా ఉండాలంటారు. సెట్స్‌లో హీరో ఏది అడిగినా కాదనకుండా సమకూర్చుతారు. గౌరవ మర్యాదల విషయంలోనూ తేడా చూపించేస్తారు. నిబంధనలన్నీ హీరోయిన్లకే ఉంటాయి’’ అని కృతీ సనన్‌ చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. ఆమె నటించిన ‘కాక్‌టెయిల్‌ 2’ చిత్రం జూన్‌ 19న విడుదల కానుంది.

ఈ చిత్రానికి సంబంధించిన ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్న కృతీ సనన్‌... ‘‘బాలీవుడ్‌లో నేను నెపోటిజమ్‌ బాధితురాలిని’’ అని పేర్కొన్నారు. ఈ విషయం గురించి ఇంకా మాట్లాడుతూ – ‘‘స్టార్‌ కిడ్స్‌ వల్ల బాలీవుడ్‌లో చాలా అవకాశాలు కోల్పోయాను. ముందు నన్ను హీరోయిన్‌గా తీసుకుని, ఆ తర్వాత స్టార్‌ కిడ్స్‌ కోసం నన్ను పక్కన పెట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి.

వారసులతో పోటీ పడి అవకాశాలు తెచ్చుకోవడానికి చాలా కష్టపడ్డాను. ‘మిమి’ సినిమాకి ముందు ఐదేళ్లు నా కెరీర్‌ ఎంతో కష్టంగా సాగింది. టాలెంట్‌ ఉండి కూడా అవకాశాల కోసం చాలా ఎదురు చూడాల్సి వచ్చేది. దాంతో కొంత ఒత్తిడికి లోనై, సినిమాల ఎంపిక విషయంలో తప్పుడు నిర్ణయాలు తీసుకున్నాను. కొన్ని చేదు అనుభవాలు, పరాజయాలు, కష్టాలు అనుభవ పాఠాలుగా ఉపయోగపడ్డాయి. కెరీర్‌లో ధైర్యంగా ఎలా ముందుకు సాగాలో నేర్పించాయి’’ అని పేర్కొన్నారు కృతీ సనన్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement