టాలీవుడ్‌లో పర్సంటేజీ వివాదం.. సబ్‌ కమిటీ ఏర్పాటు | Sub Committee Formed On Tollywood Percentage Issue | Sakshi
Sakshi News home page

Tollywood Percentage Issue: టాలీవుడ్‌లో పర్సంటేజీ వివాదం.. సబ్‌ కమిటీ ఏర్పాటు

May 15 2026 7:01 PM | Updated on May 15 2026 7:38 PM

Sub Committee Formed On Tollywood Percentage Issue

టాలీవుడ్‌లో సింగిల్ స్క్రీన్ థియేటర్ల అంశంపై ముందడుగు పడింది. ఇవాళ తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌లో జరిగిన సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పర్సంటేజీ వివాదంపై నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లతో జాయింట్ మీటింగ్ నిర్వహించారు. ఈ పర్సంటేజీ సమస్యను వేగంగా, సామరస్యంగా పరిష్కరించేందుకు ముందుకొచ్చారు. ఇందుకోసం ప్రత్యేకంగా సబ్‌ కమిటీ ఏర్పాటు చేశారు.

ముఖ్యంగా ఎగ్జిబిటర్ల సెక్టార్‌కు సంబంధించిన పర్సంటేజీ విధానంపై చర్చ జరిగింది. సబ్‌ కమిటీ ఛైర్మన్‌గా డి. సురేష్ బాబు, కన్వీనర్లుగా అల్లు అరవింద్, దిల్ రాజు, కె.ఎల్. నారాయణ, కె. అశోక్ కుమార్ ఉన్నారు.  ఈ  సబ్-కమిటీలో మూడు రంగాలకు (నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు) సమాన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నిర్మాతల రంగం నుంచి వై. సురేందర్ రెడ్డి, వై. సుప్రియ, వై. రవి శంకర్, బి. బాపినీడు, చెరుకూరి సుధాకర్, జి. శ్రీనివాస్ కుమార్(ఎస్‌కేఎన్), టి. ప్రసన్న కుమార్ సభ్యులుగా ఉన్నారు.

ఎగ్జిబిటర్స్‌ రంగం నుంచి వి. ప్రతాప్ రెడ్డి, టి. బాల్గోవింద్ రాజ్, కె. అనుపమ్ రెడ్డి, పి. శ్రీనివాస రావు, జి. వీరనారాయణ బాబు, కె. వంశీ కిషోర్ (చిన్ని), ఎం. విజేందర్ రెడ్డి సభ్యులుగా ఎంపికయ్యారు. డిస్ట్రిబ్యూటర్స్‌ రంగం నుంచి డి. విష్ణు మూర్తి, వి. వీరనాయుడు, ఎన్. సుధాకర్ రెడ్డి, ముత్యాల రామదాసు, ఎన్. నాగార్జున,  బి. మధుసూదన్ రెడ్డి (ఠాగూర్ మధు), ధీరజ్ మొగిలేని కూడా ఉన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement