
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తోన్న తాజా చిత్రం కె-ర్యాంప్. ఈ సినిమాకు జైన్స్ నాని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ రొమాంటిక్ కామెడీ మూవీలో యుక్తి తరేజా హీరోయిన్‌గా కనిపించనుంది. ఈ చిత్రాన్ని హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్ పతాకాలపై రాజేశ్ దండా, శివ బొమ్మ నిర్మిస్తున్నారు. ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా దీపావళి పండగ సందర్భంగా అక్టోబర్ 18న విడుదల కానుంది.
ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ మూవీ నుంచి టైటిల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సినిమా నుంచి టిక్కల్ టిక్కల్ అంటూ సాగే పాటను విడుదల చేశారు. ఈ పాటకు సురేంద్ర కృష్ణ లిరిక్స్ అందించగా.. సాయిచరణ్ భాస్కరుని పాడారు. ఈ సాంగ్కు చైతన్ భరద్వాజ్ సంగీతమందించారు. ఇప్పటికే రిలీజైన కలలే కలలే.. అంటూ సాగే పాట ఆడియన్స్‌ను తెగ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.