స్టార్‌ హీరోతో పాన్‌ ఇండియా సినిమా చేయబోతున్నాను: రాజేష్‌ దండా | Rajesh danda Talk About Bachala Malli Movie | Sakshi
Sakshi News home page

స్టార్‌ హీరోతో పాన్‌ ఇండియా సినిమా చేయబోతున్నాను: రాజేష్‌ దండా

Mar 19 2024 12:37 PM | Updated on Mar 19 2024 1:41 PM

Rajesh danda Talk About Bachala Malli Movie - Sakshi

‘‘మా హాస్య మూవీస్‌లో ‘ఇట్లు మారేడుమిల్లి, ఊరిపేరు భైరవకోన, సామజవరగమన’ చిత్రాలతో హ్యాట్రిక్‌ సక్సెస్‌ అందుకున్నాను. ‘అల్లరి’ నరేశ్, సందీప్‌ కిషన్, శ్రీవిష్ణు, కిరణ్‌ అబ్బవరం వంటి హీరోలతో సినిమాలు చేస్తున్నాను. నాకు కాంబినేషన్‌ కాదు.. కథే ముఖ్యం. వైవిధ్యమైన కథలతో సినిమాలు తీస్తుండటంతో ప్రేక్షకులు కూడా ఆదరిస్తున్నారు’’ అన్నారు నిర్మాత రాజేశ్‌ దండా.

సోమవారం రాజేశ్‌ దండా విలేకరులతో మాట్లాడుతూ–‘‘స్వామి రారా’ చిత్రంతో పంపిణీదారునిగా నా ప్రయాణం మొదలుపెట్టి దాదాపు 82 సినిమాలు రిలీజ్‌ చేశాను. అనిల్‌ సుంకరగారితో కలిసి ‘సామజవరగమన, ఊరిపేరు భైరవకోన’ వంటి చిత్రాలు నిర్మించా. ప్రస్తుతం ‘అల్లరి’ నరేశ్‌తో తీస్తున్న ‘బచ్చలమల్లి’ 50 శాతం పూర్తయింది.

అలాగే సందీప్‌ కిషన్‌ హీరోగా త్రినాథరావు దర్శకత్వంలో సినిమా చేస్తున్నా. కిరణ్‌ అబ్బవరం హీరోగా ఓ సినిమా ఉంది. చిరంజీవిగారి కోసం ప్రసన్నకుమార్‌ బెజవాడ రెడీ చేసిన కథతోనే సందీప్‌ కిషన్‌ మూవీ తీస్తున్నాం అనడంలో వాస్తవం లేదు. ఇక ఓ స్టార్‌ హీరోతో ఓ పాన్‌ ఇండియా మూవీ చేయబోతున్నా. అది ఎవరనేది ప్రస్తుతానికి సస్పెన్స్‌’’ అన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement