
‘‘ఈ పండక్కి మంచి ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వాలని, చిన్న మెసేజ్ ఇవ్వాలని, ఒక వైబ్ క్రియేట్ అవ్వాలని మేం చేసిన ప్రయత్నం ‘కె–ర్యాంప్’ సినిమా. ప్రేక్షకుల నుంచి ΄పాజిటివ్ రెస్పాన్స్ లభిస్తోంది. ఇప్పుడున్న పోటీలో ఇంతమంచి కలెక్షన్స్ రావడం మామూలు విషయం కాదు. ఫ్యామిలీ ఆడియన్స్ సినిమాకు వెళ్తున్నారు. షో బై షో కలెక్షన్స్ పెరుగుతున్నాయి. స్క్రీన్స్ యాడ్ అవుతున్నాయి.
ఈ దీపావళికి ‘కె–ర్యాంప్’తో నాకు మంచి సక్సెస్ అందించిన అందరికీ ధన్యవాదాలు’’ అని కిరణ్ అబ్బవరం అన్నారు. కిరణ్ అబ్బవరం హీరోగా, యుక్తీ తరేజా హీరోయిన్‌గా నటించిన తాజా చిత్రం ‘కె–ర్యాంప్’. జైన్స్ నాని దర్శకత్వంలో రాజేశ్ దండ, శివ బొమ్మకు నిర్మించిన ఈ చిత్రం శనివారం విడుదలైంది.
శనివారం సాయంత్రం యూనిట్ నిర్వహించిన సక్సెస్‌మీట్‌లో రాజేశ్ దండ మాట్లాడుతూ– ‘‘ఇలాంటి సినిమాల్లో లాజిక్స్ వెతక్కూడదు. అయితే కొందరు మా సినిమా పట్ల పక్షపాతం చూపిస్తున్నారు. దీపావళికి రిలీజైన సినిమాల్లో ఏ సినిమా కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూసి, నిజాలు తెలుసుకోవాలి’’ అని చెప్పారు. ‘‘కె–ర్యాంప్’ను హీరో కిరణ్‌గారు భుజాన వేసుకుని మోశారు కాబట్టి మంచి రిజల్ట్ వచ్చింది. ప్రేక్షకుల స్పందన బాగుంది’’ అన్నారు జైన్స్ నాని. ‘కె–ర్యాంప్’ విజయం పట్ల వీకే నరేశ్, యుక్తీ తరేజా సంతోషం వ్యక్తం చేశారు.