Varun Tej Gives Mass Warning to Who Make Negative Comments on Ram Charan - Sakshi
Sakshi News home page

Varun Tej: రామ్‌చరణ్‌ను విమర్శించేవాళ్లకు వరుణ్‌తేజ్‌ గట్టి వార్నింగ్‌!

Mar 28 2022 1:59 PM | Updated on Mar 28 2022 3:18 PM

Varun Tej Gives Mass Warning to Who Make Negative Comments on Ram Charan - Sakshi

చిన్నప్పుడు నన్ను బాగా ఏడిపిస్తుండేవాడు. చాలా భయపడేవాడిని. కానీ చిరుత సినిమా తర్వాత ఆయనలో మెచ్యూరిటీని చూశాను. చరణ్‌ అన్నను ఎవరైనా నోరెత్తి ఒక మాట మాట్లాడాలంటే మీరందరితోపాటు నేనూ అక్కడే ఉంటాను. ముందు మనతో మాట్లాడమని చెప్పండి.

పాన్‌ ఇండియా మూవీ ఆర్‌ఆర్‌ఆర్‌(రౌద్రం రణం రుధిరం) సక్సెస్‌తో సంతోషంలో మునిగితేలుతున్నారు తారక్‌, చెర్రీ ఫ్యాన్స్‌. ఈ విజయానందంలో మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ బర్త్‌డే వేడుకలు మరింత ఘనంగా జరిగాయి. ఆదివారం (మార్చి 27) శిల్పకళా వేదికలో జరిగిన చెర్రీ బర్త్‌డే పార్టీకి సెలబ్రిటీలు వరుణ్‌ తేజ్, మెహర్‌ రమేష్, బాబీ సహా తదితర చిత్రరంగ ప్రముఖులు, అభిమానులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వరుణ్‌ తేజ్‌ స్పీచ్‌ వైరల్‌గా మారింది.

స్టేజీపై వరుణ్‌ తేజ్‌ మాట్లాడుతూ.. 'చిన్నప్పుడు చరణ్‌ అన్న నన్ను బాగా ఏడిపిస్తుండేవాడు. చాలా భయపడేవాడిని. కానీ చిరుత సినిమా తర్వాత మెగాస్టార్‌లోని మెచ్యూరిటీని ఆయనలో చూశాను. నా అన్న అని చెప్పడం లేదు, కానీ చరణ్‌ అన్నలాంటి గొప్ప వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు. అలాంటి అన్నకు తమ్ముడిగా ఉన్నందుకు గర్వంగా ఫీలవుతున్నాను. సాధారణంగా బర్త్‌డేకు మేము గిఫ్ట్‌ ఇవ్వాలి. కానీ ఈసారి అల్లూరి సీతారామరాజు పాత్రతో మీరు మాకు గిఫ్ట్‌ ఇచ్చారు. చరణ్‌ అన్న ప్రపంచవ్యాప్తంగా గొప్ప స్థాయికి చేరుకోవాలని కోరుకుంటున్నాను. చరణ్‌ అన్నను ఎవరైనా నోరెత్తి ఒక మాట అనాలంటే మీరందరితోపాటు నేనూ అక్కడే ఉంటాను. ముందు మనతో మాట్లాడమని చెప్పండి. తర్వాత ఆయనతో మాట్లాడొచ్చు' అంటూ చెర్రీని విమర్శించేవాళ్లకు గట్టి వార్నింగే ఇచ్చాడు వరుణ్‌ తేజ్‌.

చదవండి: ఆస్కార్‌ విజేతలు వీళ్లే, భారత డాక్యుమెంటరీకి నిరాశ

రామ్‌చరణ్‌ లగ్జరీ ఇల్లు, ఫొటోలు వైరల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement