తెలుగు యంగ్ హీరో రాజ్ తరుణ్.. ఈ నెలలో ఓటీటీ సినిమా 'చిరంజీవ'తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ చిత్రం ఓ మాదిరి రెస్పాన్స్ అందుకుంది. ఒకప్పటితో పోలిస్తే ఇతడి నుంచి వచ్చే మూవీస్ తగ్గిపోయాయి. అలానే ప్రేక్షకుల నుంచి పెద్దగా స్పందన ఏం రావట్లేదు. అలాంటిది ఇప్పుడు మరోసారి తన అదృష్టం పరీక్షించుకునేందుకు 'పాంచ్ మినార్' అనే చిత్రాన్ని సిద్దం చేశాడు.
(ఇదీ చదవండి: రామ్ చరణ్ పెద్ది మూవీ.. చికిరి చికిరి సాంగ్ క్రేజీ రికార్డ్!)
ఈ శుక్రవారం(నవంబరు 21) థియేటర్లలోకి సినిమా రాబోతుంది. ఈ క్రమంలోనే ఆదివారం, ట్రైలర్ లాంచ్ చేశారు. కామెడీగా నవ్వించే ప్రయత్నం చేశారు. 'పాంచ్ మినార్' విషయానికొస్తే.. ఆవారాగా తిరిగే హీరో, ఉద్యోగం చేసుకునే హీరోయిన్ ప్రేమలో పడతాడు. జాబ్ చేస్తేనే పెళ్లి అని చెప్పడంతో ట్యాక్సీ డ్రైవర్‌గా మారతాడు. తర్వాత అనుకోని పరిస్థితుల్లో మర్డర్ కేసులో ఇరుక్కుంటాడు. ఓవైపు పోలీసులు, మరోవైపు గుండాల మధ్య చిక్కుకున్న హీరో.. ఎలా బయటపడ్డాడు అనేదే స్టోరీలా అనిపిస్తుంది. దీంతోనైనా రాజ్ తరుణ్ హిట్ అందుకుంటాడేమో చూడాలి?
(ఇదీ చదవండి: మహేశ్ 'వారణాసి' ఈవెంట్‌కి అన్ని కోట్లు ఖర్చయిందా?)


