పీరియాడికల్‌ యాక్షన్‌ డ్రామాలో... | Mega Supreme Hero Sai Durgha Tej New Pan India High Action Drama Film SDT18 Announced | Sakshi
Sakshi News home page

పీరియాడికల్‌ యాక్షన్‌ డ్రామాలో...

Published Sat, Jun 22 2024 12:12 AM | Last Updated on Sat, Jun 22 2024 12:12 AM

Mega Supreme Hero Sai Durgha Tej New Pan India High Action Drama Film SDT18 Announced

‘విరూపాక్ష’ (2023) వంటి హిట్‌ మూవీ తర్వాత సాయి దుర్గ తేజ్‌ నటిస్తున్న తాజా పాన్‌ ఇండియా మూవీ ‘ఎస్‌డీటీ 18’ (వర్కింగ్‌ టైటిల్‌). ఈ చిత్రంతో రోహిత్‌ కేపీ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ‘హను–మాన్‌’ వంటి బ్లాక్‌బస్టర్‌ మూవీ నిర్మించిన కె. నిరంజన్‌ రెడ్డి, చైతన్య రెడ్డి ‘ఎస్‌డీటీ 18’ నిర్మిస్తున్నారు.

ఈ చిత్రం అనౌన్స్‌మెంట్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ – ‘‘పీరియాడికల్‌ హై యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఎస్‌డీటీ 18’. ఇందులో సాయి దుర్గ తేజ్‌ పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుంది. ఈ చిత్రం కోసం నిర్మించిన ఓ భారీ సెట్‌లో ప్రస్తుతం తొలి షెడ్యూల్‌ జరుగుతోంది. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రం రూపొందుతోంది’’ అని చిత్రబృందం పేర్కొంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement