
అల్లు అర్జున్ (Allu Arjun) గారు ఇండియాలోనే బిగ్గెస్ట్ స్టార్ అంటున్నాడు మెగా హీరో సాయిదుర్గతేజ్ (Sai Durga Tej). ఆయన్ను చూస్తే చాలా గర్వంగా ఉందని పేర్కొన్నాడు. తాజాగా సాయిదుర్గ తేజ్ హైదరాబాద్‌లో.. ఫాస్ట్ అండ్ క్యూరియస్ ది జెన్ జెడ్ ఆటో ఎక్స్‌పోను ప్రారంభించాడు. ఈ ఈవెంట్‌లో విద్యార్థులతో కాసేపు సరదాగా ముచ్చటించాడు. ఈ సందర్భంగా ఒకరు అల్లు అర్జున్ గురించి ప్రశ్న అడిగారు.
పాన్ ఇండియా స్టార్
అందుకు సాయి దుర్గతేజ్ స్పందిస్తూ అల్లు అర్జున్ గారు అని సంబోధించాడు. అల్లు అర్జున్‌గారి గురించి ఏం చెప్పాలండి? ఆయన సూపర్‌గా యాక్ట్ చేస్తారు. దేశంలోనే బిగ్గెస్ట్ స్టార్ అయిపోయారు. చాలా గొప్పోళ్లు అయిపోయారు. అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ఎంతో గర్వంగా ఉంది అని చెప్పుకొచ్చాడు. ఇప్పుడీ వ్యాఖ్యలు నెట్టింట వైరలవుతున్నాయి.
సినిమా
సినిమాల విషయానికి వస్తే.. సాయిదుర్గతేజ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ సంబరాల ఏటిగట్టు. ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్‌గా యాక్ట్ చేస్తోంది. రోహిత్ కేపీ దర్శకత్వం వహిస్తున్నారు. సెప్టెంబర్‌లో రిలీజవ్వాల్సిన మూవీని పలు కారణాలతో వాయిదా వేశారు. కొత్త రిలీజ్ డేట్ ఇంకా ప్రకటించలేదు.