మామయ్య ఆశీస్సులతో కొత్త ప్రయాణం ‍ప్రారంభించిన 'సాయి దుర్గ తేజ్‌' | Sai Durga Tej New Journey Start With Chiranjeevi Blessings | Sakshi
Sakshi News home page

మామయ్య ఆశీస్సులతో కొత్త ప్రయాణం ‍ప్రారంభించిన 'సాయి దుర్గ తేజ్‌'

Mar 9 2024 4:19 PM | Updated on Mar 9 2024 4:38 PM

Sai Durga Tej New Journey Start With Chiranjeevi Blessings - Sakshi

మెగా హీరో సాయి దుర్గ తేజ్‌ కొత్త జర్నీని ప్రారంభించాడు. ఆయన ముందుగు చెప్పినట్లే నిర్మాతగా తన ప్రయాణాన్ని కొనసాగించనున్నాడు. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా ద్వారా మెగా అభిమానులకు తెలిపాడు. తను ఏర్పాటు చేసిన కొత్త ప్రొడక్షన్‌ హౌస్‌కు 'విజయదుర్గ ప్రొడక్షన్స్‌' అనే పేరు పెట్టినట్లు తెలిపాడు. 

సాయి ధరమ్‌ తేజ్ తాజాగా తను పేరును కూడా ‌మార్చుకున్న విషయం తెలిసిందే. తన అమ్మగారి పేరు దుర్గను తీసుకుని సాయి దుర్గ తేజ్‌గా ఆయన పెట్టుకున్నాడు. ఇప్పుడు కొత్తగా ఏర్పాటు చేసిన ప్రొడక్షన్‌ హౌస్‌కు కూడా తన అమ్మగారి పేరుతోనే  'విజయదుర్గ ప్రొడక్షన్స్‌' అని ఫిక్స్‌ చేశాడు. అమ్మపేరు మీద నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసినందుకు చాలా సంతోషంగా ఉందని ఆయన ఇలా తెలిపాడు.

'మా మామయ్యలు చిరంజీవి, నాగబాబు, మా గురువు పవన్‌కల్యాణ్‌ ఆశీస్సులతో దీన్ని ప్రారంభించాను. నా కెరీర్ ప్రారంభంలో నాకు సహకరించిన నిర్మాత దిల్‌రాజు ఈ ప్రొడక్షన్ హౌస్‌ను లాంచ్ చేయడం ఆనందంగా ఉంది. 'సత్య' సినిమా టీమ్‌తో కలిసి ఈ సంస్థను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది.' అని ఆయన ఎక్స్‌ పేజీలో పోస్ట్‌ చేశాడు. దీంతో మెగా ఫ్యాన్స్‌ ఆయనకు శుభాకంక్షలు చెబుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement