సాంకేతికతపై అవగాహన పెంచుకోండి | - | Sakshi
Sakshi News home page

సాంకేతికతపై అవగాహన పెంచుకోండి

Feb 8 2026 4:26 AM | Updated on Feb 8 2026 4:26 AM

సాంకేతికతపై అవగాహన పెంచుకోండి

సాంకేతికతపై అవగాహన పెంచుకోండి

–జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణ సారిక

చిత్తూరు అర్బన్‌ : సాంకేతిక పద్ధతులపై అవగాహన పెంచుకోవాలని ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణసారిక పేర్కొన్నారు. స్థానిక జిల్లా కోర్టు భవనాల సముదాయంలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని న్యాయమూర్తులకు శ్రీఈ కోర్ట్‌ ప్రోగ్రాంశ్రీపై శనివారం నుంచి రెండు రోజుల శిక్షణను ప్రధాన న్యాయమూర్తి ప్రారంభించారు. సాంకేతికతపై అవగాహన పెంచుకుంటే కోర్టుల వ్యవహారాలను త్వరగా పూర్తి చేయవచ్చునన్నారు. శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. హైకోర్టు రిజిస్ట్రార్‌ ఎస్‌.కమలాకర రెడ్డి(జ్యుడిషియల్‌), హైకోర్టు రిజిస్ట్రార్‌ వి. శ్రీనివాస శివరామ్‌(విజిలెన్స్‌), కర్నూలుకు చెందిన సివిల్‌ జడ్జి దివాకర్‌(సీనియర్‌ డివిజన్‌)లు రిసోర్స్‌ పర్సన్లుగా వ్యవహరిస్తూ.. ఈ కోర్ట్‌పై వివరించారు. శిక్షణలో మొదటి అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి రమేష్‌, నాల్గవ అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి అర్చన, ఎనిమిదవ అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి శ్రీదేవి, తొమ్మిదవ అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి శ్రీనివాసరావు ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని న్యాయమూర్తులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement