ముగిసిన అంతర్జాతీయ సదస్సు | - | Sakshi
Sakshi News home page

ముగిసిన అంతర్జాతీయ సదస్సు

Feb 20 2026 6:53 AM | Updated on Feb 20 2026 6:53 AM

ముగిసిన అంతర్జాతీయ సదస్సు

ముగిసిన అంతర్జాతీయ సదస్సు

తిరుపతి సిటీ: జాతీయ సంస్కృత వర్సిటీ అద్వైత వేదాంత విభాగం ఆధ్వర్యంలో గత పదిరోజలుగా శ్రీహర్షుని ‘‘ఖండన ఖండఖాద్య’’ గ్రంథంపై జరిగిన అంతర్జాతీయ శాస్త్ర అధ్యయన శిబిరం గురువారం ఘనంగా ముగిసింది. వర్సిటీలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా న్యూఢిల్లీకి కేంద్రీయ సంస్కృత వర్సిటీ వీసీ శ్రీనివాస వరకేది ఆన్‌లైన్‌ ద్వారా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ అంతర్జాతీయ శిబిరాలు మేధోపరమైన గ్రంథాల బోధనకు ప్రేరణనిస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం సమాజానికి మేలుకలిగించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్‌ విష్ణుభట్టాచార్యులు, మహామహోపాధ్యాయ ఆచార్య మణి ద్రావిడ శాస్త్రి, ప్రొఫెసర్‌ గణపతి భట్‌, కేఎస్‌ సతీష్‌, నాగరాజ భట్‌, శ్రఋహరి శివరామ్‌, షిండే మనోజ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement