శివనామ స్మరణం..పులకించిన కై లాసం | - | Sakshi
Sakshi News home page

శివనామ స్మరణం..పులకించిన కై లాసం

Feb 20 2026 6:53 AM | Updated on Feb 20 2026 6:53 AM

శివనామ స్మరణం..పులకించిన కై లాసం

శివనామ స్మరణం..పులకించిన కై లాసం

కై లాసగిరి పర్వత శ్రేణులు శివనామస్మరణతో పులకించిపోయాయి. గిరి ప్రదక్షిణకు వస్తున్న నవదంపతులకు నీరాజనాలు పలికేందుకు అశేష రీతిలో భక్తులు తరలివచ్చారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరస్వామివారి గిరి ప్రదక్షిణ వైభవంగా జరిగింది. శివపార్వతుల కల్యాణానికి విచ్చేసిన సకల దేవ గణాలు, మునులు, రుషులకు స్వామి, అమ్మవార్లు ఘనంగా వీడ్కోలు పలికి కృతజ్ఞతలు తెలిపారు. శ్రీకాళహస్తీశ్వస్వామి, జ్ఞానప్రసూనాంబ ఉత్సవమూర్తులను చప్పరాలపై కొలువుదీర్చి గిరిప్రదక్షిణ నిర్వహించారు. అంజూరు మండపం వద్ద స్వామి అమ్మవార్లు కాసేపు విశ్రాంతి తీసుకున్నారు. అక్కడ నుంచి స్వామి అమ్మవార్లు ఎదురుసేవ మండపానికి, తరువాత ఆలయానికి చేరుకున్నారు. – శ్రీకాళహస్తి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement