నేడు ‘కోర్టు’ పరీక్షలు
చిత్తూరు అర్బన్: చిత్తూరు జిల్లా కోర్టులో ఉన్న జిల్లా న్యాయసేవాధికార సంస్థలో ఖాళీగా ఉన్న రెండు పోస్టుల భర్తీ కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు శుక్రవారం రాత పరీక్షలు నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణసారిక తెలిపారు. చిత్తూరు నగరంలోని పీవీకేఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రెండు దఫాలుగా పరీక్షలు జరుగుతాయన్నా రు. రికార్డు అసిస్టెంట్ పోస్టుకు ఉదయం 9 నుంచి 10.30 గంటల వరకు, ఫ్రంట్ ఆఫీస్ కో–ఆర్డినేటర్ పోస్టుకు మధ్యాహ్నం 12 నుంచి 1.30 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తామన్నారు. డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టు భర్తీ రాత పరీక్షను వాయిదా వేసినట్టు వెల్లడించారు.
పకడ్బందీగా ఇంటర్ పరీక్షలు
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా ఈ నెల 23 నుంచి జరగబోయే ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని ఇంటర్మీడియెట్ డీఐఈవో రఘుపతి ఆదేశించారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం జిల్లా వ్యాప్తంగా ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేపడుతున్నట్టు తెలిపారు. పరీక్షల నిర్వహణ ప్రమాణాలు, నిబంధనల ప్రకారం నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నట్టు వెల్లడించారు. పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు తప్పనిసరి అన్నారు. ప్రతి కేంద్రం వద్ద కళాశాల పేరు, పరీక్ష కేంద్రం నంబర్ కనిపించేలా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలన్నారు. నో సెల్‌ఫోన్ జోన్ అని విద్యార్థులకు అర్థమయ్యేలా బోర్డు ఏర్పాటు చేయాలన్నారు.
సెలవులో కలెక్టర్
చిత్తూరు కలెక్టరేట్ : వ్యక్తిగత పనుల నిమిత్తం కలెక్టర్ సుమిత్‌కుమార్‌గాంధీ ఈ నెల 21వ తేదీ వరకు సెలవు పెట్టారు. ఆయన తిరిగి విధుల్లో చేరే వరకు జేసీ ఆదర్శ్‌రాజేంద్రన్ ఇన్‌చార్జ్ కలెక్టర్‌గా వ్యవహరించనున్నారు. ప్రజలకు కలెక్టర్ సోమవారం అందుబాటులో ఉంటారని కలెక్టరేట్ అధికారులు చెబుతున్నారు.


