నాదోపాసన పోస్టర్ల ఆవిష్కరణ
తిరుపతి రూరల్: శ్రీ వాగ్దేవి కళా సమితి ఆధ్వర్యంలో నిర్వహించనున్న ‘నాదోపాసన’ పోస్టర్లను ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ శివశంకర్ లోతేటి తన చాంబర్‌లో గురువారం ఆవిష్కరించారు. హైదరాబాద్‌కు చెందిన శ్రీ వాగ్దేవి కళా సమితి ఆధ్వర్యంలో శాసీ్త్రయ సంగీతం, సాహిత్యాల పునరుజ్జీవనమే లక్ష్యంగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ పుణ్య క్షేత్రాల్లో నాదోపా సన శ్రేణి ద్వారా శాసీ్త్రయ సంగీత కార్యక్రమాలను నిర్వహించడాన్ని ఈ సందర్భంగా సీఎండీ అభినందించారు. ఈ కార్యక్రమాల్లో భాగంగా ఈ నెల 21వ తేదీన ఒంటిమిట్టలోని కోదండరామస్వామి ఆలయ ప్రాంగణంలో శాసీ్త్రయ సంగీత కచేరి, హరికథను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ వాగ్దేవి కళా సమితి ప్రతి నిధులు, ఎస్పీడీసీఎల్ డైరెక్టర్ పి.అయూబ్ ఖాన్, చీఫ్ జనరల్ మేనేజర్లు జె. రమణాదేవి, సీహెచ్ రామచంద్రరావు, ఎం.మురళీకుమార్, కంపెనీ సెక్రటరీ బీవీఎస్ ప్రకాష్, ఎస్‌ఈ తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు.


