హోమియో వైద్యం.. దేశ విజ్ఞానోన్నతికి నిదర్శనం
– ఎస్వీ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్
డాక్టర్ జి.రవిప్రభు
పుత్తూరు: అద్భుత ఫలితాలిస్తున్న హోమియోపతి మన దేశ వైద్య విజ్ఞానోన్నతికి నిదర్శనమని తిరుపతి ఎస్వీ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జీ.రవిప్రభు పేర్కొన్నారు. స్థానిక కేకేసీ హోమియో మెడికల్ కళాశాలలో జరిగిన ఫస్ట్ బ్యాచ్ గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. నేటి సమాజంలో హోమియో వైద్యానికి ప్రత్యేక స్థానం ఉందన్నారు. ఈ వైద్యం పేదలకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందన్నారు. వైద్య వృత్తిని ఎంచుకొనే విద్యా ర్థులు సేవా దృక్పథం కలిగి ఉండాలన్నారు. అనంతరం కళాశాల తొలి బ్యాచ్ ఉత్తీర్ణులకు సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో కళాశాల చైర్మన్ కె.కుప్పయ్యశెట్టి, ప్రినిపల్ డాక్టర్ శరవణన్, వైస్ చైర్మన్స్ కె.నరసింహారావ్ మంజుల, కె.రవిశేఖర్ వైష్ణవి, అధ్యాపకులు పాల్గొన్నారు.


