ఫౌల్ట్రీ రైతులు అప్రమత్తంగా ఉండాలి | - | Sakshi
Sakshi News home page

ఫౌల్ట్రీ రైతులు అప్రమత్తంగా ఉండాలి

Feb 9 2026 7:41 AM | Updated on Feb 9 2026 7:41 AM

ఫౌల్ట్రీ రైతులు  అప్రమత్తంగా ఉండాలి

ఫౌల్ట్రీ రైతులు అప్రమత్తంగా ఉండాలి

● కార్వేటినగరంలో ర్యాపిడ్‌ టీమ్‌ ఏర్పాటు ● కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ గాంధీ ● కోళ్లల్లో అసాధారణ మరణాలు సంభవించినా, గురక, ముక్కులో నీరు కారడం తదితరాలు గమనిస్తే వెంటనే పశువైద్యులకు సమాచారం ఇవ్వాలి. ● వండిన చికెన్‌, గుడ్లు తినడం వల్ల ప్రమాదం లేదు. వీటిని 70 డిగ్రీల సెల్సియస్‌ కంటే ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద బాగా ఉడికించి తీసుకోవాల్సి ఉంటుంది. ● ఇతర సమాచారం, ఫిర్యాదులకు పశుసంవర్థక శాఖ 9959763573, 9390318814, 7013119447, కలెక్టరేట్‌ కంట్రోల్‌ రూమ్‌ 08572 242730 నంబర్లలో సంప్రదించాలని కలెక్టర్‌ సూచించారు.

● కార్వేటినగరంలో ర్యాపిడ్‌ టీమ్‌ ఏర్పాటు ● కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ గాంధీ

చిత్తూరు కలెక్టరేట్‌ : జిల్లాలోని ఫౌల్ట్రీ రైతులు బర్డ్‌ ఫ్లూపై అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ గాంధీ ఆదేశించారు. ఆయన ఆదివారం పశుసంవర్థక శాఖ, తదితర శాఖల అధికారులతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఆయన మాట్లాడు తూ కోళ్లు అధిక సంఖ్యలో మృతి చెందితే వెంటనే పశుసంవర్థకశాఖ అధికారులతోపాటు కలెక్టరేట్‌ లో ఏర్పాటు చేసిన కంట్రోల్‌ రూమ్‌కు తెలియజే యాలన్నారు. ఏవీఎన్‌ ఇన్‌ఫ్లూయెంజా అనేది పక్షి నుంచి పక్షికి మాత్రమే వ్యాపిస్తుందన్నారు. ఇది పక్షులు, కోళ్ల నుంచి మనుషులకు వ్యాప్తి చెంద దని తెలిపారు. కార్వేటినగరం మండలంలో కోళ్ల మరణాలు సంభవించడంతో ర్యాపిడ్‌ టీమ్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. కార్వేటినగరం మండలం ఆర్‌కే పేటలో పరిసరాలను శుభ్రంగా ఉంచేలా చర్యలు చేపట్టాలన్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి వ్యాధి నిర్ధారణకు నమూనాలను సేకరించి మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని భూపాల్‌లో ఉండే నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హై సెక్యురిటీ అనిమల్‌ డిసీజెస్‌కు పంపినట్లు తెలిపారు. నివేదిక వచ్చే వరకు ప్రజలు ఆందోళన చెందకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు.

రైతులకు, ప్రజలకు సూచనలు

ఫౌల్ట్రీ ఫారం నిర్వాహకులు బయో సెక్యూరిటీ నిబంధనలను కఠినంగా పాటించాలి. ఫౌల్ట్రీ లోపలికి బయటి వ్యక్తులను, వాహనాలను అనుమతించకూడదు.

17 మంది

కోడి పందెం రాయుళ్ల అరెస్ట్‌

శాంతిపురం: కోడి పందేలు ఆడుతున్న 17 మందిని అరెస్టు చేసినట్టు రాళ్లబూదుగూరు ఎస్‌ఐ నరేష్‌ తెలిపారు. ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ మండలంలోని కర్లగట్ట–చామనపల్లి గ్రామాల మధ్య కోడి పందేలు ఆడుతున్నట్టు సమాచారం అందిందన్నారు. కుప్పం రూరల్‌ సీఐ మల్లేష్‌ యాదవ్‌ సహకారంతో పందేలు జరుగుతున్న ప్రాంతంలో డ్రోన్‌ కెమెరాతో తనిఖీ చేపట్టినట్టు చెప్పారు. చింత చెట్ల తోపులో కోడి పందేలు జరుగుతున్నట్టు గుర్తించి దాడి చేశామన్నారు. 17 మందిని అదుపులోకి తీసుకుని కుప్పం కోర్టులో హాజరుపరిచామని పేర్కొన్నారు. వారి నుంచి రూ.44,220లు, మూడు పందెం కోళ్లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. నిందితులు కుప్పం ప్రాంతంతో పాటు కర్ణాటక, తమిళనాడుకు చెందిన వారిగా గుర్తించామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement